
డెలాయిటీ సర్వేలో వెల్లడైన విషయాలు:
వొడాఫోన్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశీయ పన్ను విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ప్రతిపాదిత జనరల్ యాంటీ అవాయిడెన్స్ నిబంధనలు(గార్), పూర్వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా చేసిన పన్ను సవరణలు ఇందులు నిదర్శనం.
భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే సింగపూర్ న్యాయపరిధిలోకి వచ్చేలా పెట్టడం ఉత్తమమని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 80% మంది దేశీయ కార్పొరేట్ పన్ను రేట్లను 20-30% పరిధిలో క్రమబద్దీకరించాల్సి ఉన్నదని అభిప్రాయపడినట్లు తెలిపింది.
షోమ్ కమిటీ రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలు సంతృప్తికరంగా ఉన్నాయని, గార్ ప్యానెల్ సభ్యుల స్వతంత్రపైనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో పాటు గార్ కమిటీ సలహాలను ప్రభుత్వం పాటించాల్సి ఉన్నదని అధిక శాతం ఇన్వెస్టర్లు అభిప్రాయపడినట్లు పేర్కొంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications