
ఇప్పటికే ఆర్థిక లోటును జిడిపిలో 5.3 శాతం వద్దే కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే పెరుగుతున్న వ్యయం, మందగించిన ఆదాయం కారణంగా ఆర్థిక లోటు లక్ష్యాన్ని 5.1 శాతం నుంచి 5.3 శాతానికి పెంచామన్నారు. ప్రస్తుతం భారత్ రేటింగ్ బిబిబి మైనస్ ప్రతికూల స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే రాబోయే 12-24 నెలల కాలంలో మరింతగా రేటింగ్ స్థాయి 50 శాతానికిపైగా క్షీణించే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇదే జరిగితే అప్పుడు భారత్ పెట్టుబడులకు ఏమాత్రం ఆశాజనకం కాదని తెలిపింది.
ఇక మరో రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) సైతం 2014 సాధారణ ఎన్నికల దృష్ట్యా ఒకవేళ ఆర్థిక సంస్కరణలు మూలనపడితే రేటింగ్‌కు ముప్పు తప్పదని గత నెలలోనే హెచ్చరించింది. ప్రస్తుతం ఫిచ్, ఎస్‌అండ్‌పీలు భారత్‌కు ‘బీబీబీ మైనస్' నెగటివ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఇది చిట్టచివరి ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్. దీనికి గనుక కోత పెడితే ‘జంక్' స్థాయికి(పెట్టుబడులకు నిరుపయోగ గ్రేడ్) భారత్ సావరీన్ రేటింగ్ పడిపోతుంది. ఇదే జరిగితే, వర్ధమాన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల గ్రూప్‌లో తొలిసారి జంక్ స్థాయికి దిగజారిన దేశంగా భారత్ అపప్రదను మూటగట్టుకుంటుంది. దీనివల్ల భారత కార్పొరేట్లకు విదేశీ రుణాల సమీకరణ కష్టసాధ్యంగా మారుతుంది. కాగా, మరో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ మాత్రం భారత్‌కు ‘బీఏఏ3' స్థిర అవుట్‌లుక్ రేటింగ్‌ను కొనసాగిస్తుండటం గమనార్హం.
టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఇప్పటికి అధికంగానే ఉందని నవంబర్ నెల ద్రవ్యోల్బణం 7.24 శాతంగా నమోదైందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. గత త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు బలహీనంగా 5 నుంచి 5.5 శాతంగా నమోదైందని ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో టోకు ధరల ఆధారిత సూచి సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరం జీడీపీ 5.4 శాతంగా నమోదైందని.. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీడీపీ రేటు 5.7 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తోంది.
దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల కాలానికి ద్రవ్యలోటు 80 శాతానికి చేరిందని ఇది ఆందోళన కలిగించే అంశయని ఫిచ్ వివరించింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని సంస్కరణలను ఫిచ్ ప్రశంసించింది. ఈ అడుగులు సరైన దిశలో పయనిస్తున్నాయని పేర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వాటిని తప్పకుండా ప్రశంసించాలనితన నివేదికలో పేర్కొంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications