ఆర్‌బీఐ ద్రవ్య విధాన పరపతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లు తగ్గొచ్చు: ఎస్‌బీఐ

SBI hopes RBI will cut lending rate, lower CRR on Jan 29
HDFC Bank: Quotes, News
BSE 727.50BSE Quote1 (0.14%)
NSE 726.95NSE Quote1.9 (0.26%)
Indices
Sensex77,540.83Sensex Quote3.11 [0%]
న్యూఢిల్లీ: ఈ నెల 29 (మంగళవారం)న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన పరపతి సమీక్ష జరగనున్న క్రమంలో కీలక వడ్డీ రేట్లు 0.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) ఒక శాతం మేర తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ ప్రతీప్ చౌదరి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్దికాభివృద్దికి ఈ రెండు అంశాలు చాలా ముఖ్యమైనవి అన్నారు. ఆర్దికమంత్రి పి చిదంబరంతో జరిగిన బడ్జెట్ మందుస్తు సమావేశం అనంతరం ప్రతీప్ చౌదరి మీడియాతో మాట్లాడారు.

రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు, సిఆర్‌ఆర్ 50-100 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఎస్‌బిఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి ఆర్‌బిఐకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంలో వ్యాపార సంస్థల నుంచి భారీ నిధులను ఆకర్షించడానికి కరెంట్ అకౌంట్ల డిపాజిట్లపై సైతం రెండుశాతం వడ్డీని ఇవ్వడానికి బ్యాంకులను ఆర్‌బీఐ అనుమతించాలని చౌదరి కోరారు. దీంతో చాలామందిని బ్యాంకుల్లో డిపాజిట్లను చేసేందుకు ఉత్సాహపరుస్తుందన్నారు. ద్రవ్యోల్బణం 7 శాతానికి దిగివచ్చినప్పటికీ అది ఆందోళనకరమేనని... 5 శాతం దరిదాపుల్లో ఉండటమే అన్నివిధాల శ్రేయస్కరమని పునరుద్ఘాటించారు.

ఇదిలావుంటే ఈ ఏడాది మార్చికల్లా 3,000 కోట్ల రూపాయలను ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా సమీకరించాలనుకుంటున్నట్లు ఎస్‌బిఐ తెలిపింది. 3వేల కోట్ల రూపాయల సమీకరణకు ప్రభుత్వం సంకేతాలిచ్చిందని ఎస్‌బిఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి తెలిపారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన 12,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్లో భాగంగానే ఇది జరగనుంది.

రెపో రేటు: బ్యాంకులకు తాను ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలుచేసే వడ్డీరేటు.

సీఆర్‌ఆర్: బ్యాంకులు తమ డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన మొత్తం.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+