
కార్పొరేట్లతో పాటు విభిన్న పక్షాల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోఢీకరించే ప్రక్రియలో ఆర్థిక మంత్రిత్వశాఖ తన అభిప్రాయాలను ఆర్‌బీఐకి పంపే పనిలో ఉంది. ఇదిలా ఉంటే, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాలు, అభివృద్ధి విభాగానికి ప్రస్తుతం ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో... ఆయన రిటైర్ కావడానికి ముందే కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల నిబంధనలను ఖరారు చేయాల్సి ఉంటుందని కూడా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే పార్లమెంట్‌లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2011కు ఆమోదముద్ర వేయడంతో కొత్త లెసైన్స్‌ల జారీని వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి చిదంబరం సూచించిన సంగతి తెలిసిందే.
కొత్త బ్యాంకుల కోసం లైసెన్సుల జారీ విషయంలో నాన్-కార్పొరేట్ రంగానికీ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలి(పిఎమ్‌ఇఎసి) చైర్మన్ సి రంగరాజన్ అభిప్రాయపడ్డారు. నాన్ కార్పొరేట్ వ్యాపారులకు అవకాశం ఇవ్వడం రిజర్వ్ బ్యాంక్‌కి సాధ్యమేనని, వారి వ్యాపార కార్యకలాపాలను పరిశీలించి ఆ తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాలకు వారు సమర్థనీయమని భావిస్తే, అందిరితోపాటు వారికి లైసెన్సుల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మార్గదర్శకాల ప్రకారం వాణిజ్య బ్యాంకుల ఏర్పాటుకు కొత్త లైసెన్సుల కోసం సమర్దనీయమైన కార్యకలాపాల ట్రాక్ రికార్డుతోపాటు కనీసం 500 కోట్ల రూపాయల మూలధనాన్ని కలిగి ఉండాల్సి ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications