ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీది 18వ స్థానం: బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ

ప్రపంచంలో 100 మంది అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్దానాన్ని టెలికాం కంపెనీ అధినేత కార్లోస్ స్లిమ్ 70 బిలియన్ డాలర్లతో అగ్రస్దానంలో నిలవగా.. భారత్‌లో ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఏడాది ప్రపంచ కుబేరుల్లో చోటు దక్కించుకున్నారు. ముకేశ్ అంబానీ తన సంపదను 2,100 కోట్ల డాలర్ల నుంచి 2,470 కోట్ల డాలర్లకు పెరగడంతో ముకేశ్ 19వ స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకారు. ప్రపంచంలో టాప్ 100 బిలియనీర్ల సంపద 2012 సంవత్సరంలో సుమారుగా 15 శాతం పెరిగి 1.81 లక్షల కోట్ల డాలర్లకు చేరింది.
మెక్సికన్ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం టెల్మెక్స్ చైర్మన్ కార్లోస్ స్లిమ్ 7,640 కోట్ల డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా... మైక్రోసాప్ట్ వ్యవస్దాపకుడు బిల్ గేట్స్, ఫ్యాషన్ రిటైలింగ్ సంస్ద జారా అధినేత అమన్సియో అర్టెగాలు రెండు, మూడు స్దానాల్లో నిలిచారు. వీరిద్దిర సంపద 60 బిలియన్ డాలర్లకు కాస్త తక్కువగా ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ నాలుగో స్థానంలో నిలిచారు. ఈయన కిందటి ఏడాది భారీ మొత్తంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ సంపదను 5 బిలియన్ డాలర్ల మేర పెంచుకోవడం విశేషం.
స్వీడన్‌కు చెందిన ఫర్నిచర్ విక్రయ సంస్ద ఐకియా వ్యవస్థాపకుడు ఇంగ్వర్ కాంప్రాద్ తన నికర విలువను 16.6 శాతం వృద్ది చేసుకోని 40 బిలియన్ డాలర్లకు అధిపతి కాడవంతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో ఐదవ స్దానాన్ని కైవసం చేసుకున్నాడు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications