
కుంభకోణం వల్ల వారు ఏదో రకంగా ప్రయోజనం పొందినట్లు పటిష్టమైన రుజువులు చూపాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. అయితే, పిటిషనర్లు దాఖలు చేసిన ఫిర్యాదులో డెరైక్టర్లు వ్యక్తిగతంగా లాభపడ్డారని చెప్పేందుకు ఆధారాలేమీ లేవని ఆమె పేర్కొన్నారు. ఇందులోని ఆరోపణలన్నీ ఎవరికీ అనుమానం రాని విధంగా మోసానికి పాల్పడ్డట్లు సూచిస్తున్నాయని, ఒక రకంగా ప్రతివాదులైన డెరైక్టర్లు కూడా ఈ మోసంలో బాధితులే అనుకోవడానికి అవకాశం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
కేసు ఎదుర్కొన్న ఏడుగురు మాజీ డెరైక్టర్లలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ కృష్ణ పాలెపు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మాజీ డీన్ ఎం రామ్మోహన్ రావు, మాజీ కేబినెట్ కార్యదర్శి టీఆర్ ప్రసాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాజీ డెరైక్టర్ వీఎస్ రాజు ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళితే 2004 జనవరి-2009 జనవరి మధ్యకాలంలో ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో సత్యం షేర్లు కొన్న అమెరికన్ సంస్థలు ఈ కేసు వేశాయి. సత్యం కుంభకోణం బయటపడిన నేపథ్యంలో 2009 నుంచి ఆ సంస్థ వాటాదారులు నష్టపరిహారం కేసులను వేయడం మొదలుపెట్టారు. రామలింగరాజు నేతృత్వంలోని సత్యం కంప్యూటర్స్ కుంభకోణం భారత్‌లో భారీ కార్పొరేట్ కుంభకోణంగా నిలిచిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications