రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్

సుబీర్ గోకర్ణ్ మూడేళ్ల పదవీ కాలం 2012, నవంబర్‌తో ముగిసింది. ఐతే ఈ గడువును కేంద్ర ప్రభుత్వం ఒక నెల పొడిగించింది. దీంతో 2012, డిసెంబర్ 31తో గోకర్ణ్ పదవీ కాలం ముగిసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇక సుబీర్ గోకర్ణ్ రిజర్వ్ బ్యాంక్‌లో చేరకముందు ఆయన స్టాండర్డ్ అండ్ పూర్స్ ఆసియా-పసిఫిక్ లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. ఇక రాజస్థాన్ రీజనల్ డెరైక్టర్‌గా పనిచేస్తోన్న దీపాలి పంత్ జోషికి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పదోన్నతి లభించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన విభాగాన్ని ఇక నుండి ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పర్యవేక్షించనున్నారు. నిన్నటి వరకూ ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్ సుబీర్ గోకర్ణ్ నిన్న(సోమవారం) రిటైరయ్యారు. వడ్డీరేట్లు, ఇతర కీలక రేట్లు, తదితర అంశాలను ఈ విభాగం చూస్తుంది. మూడో త్రైమాసిక పరపతి విధాన సమీక్ష జనవరి 29న ప్రకటించనున్న నేపధ్యంలో ద్రవ్య విధాన విభాగం దువ్వూరి చూస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఇందులో ఇద్దరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి, ఒకరు బ్యాంకింగ్ రంగానికి చెందినవారు కాగా నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా ఆర్థికవేత్త ఉండనున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications