జనవరి 6 నుండి మన రాష్ట్రంలో 2 జిల్లాల్లో "నగదు బదిలీ పథకం"

Chidambaram
న్యూఢిల్లీ: కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న "నగదు బదిలీ పథకం" మొదటిదశను ఈరోజు నుండి దేశవ్యాప్తంగా 20 జిల్లాల్లో ప్రారంభమైంది. ఐతే మన రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈ నెల 6 నుండి ప్రారంభించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొందేందుకు అర్హులైన లబ్దిదారులకు నేరుగా నగదును బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. తొలి దశలో మన రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించగా.. ప్రస్తుతానికి వాటిని రెండు(తూర్పుగోదావరి, అనంతపురం)కు తగ్గించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నిన్న మీడియాతో మాట్లాడుతూ తొలి దశలో 20 జిల్లాల్లోనే ప్రారంభిస్తున్నా రాబోయే కాలంలో మరిన్ని జిల్లాలకు దీన్ని విస్తరిస్తామన్నారు. జనవరి 1 నుంచి 20 జిల్లాల్లో.. ఉపకార వేతనాలు, వితంతు పింఛన్లు సహా 26 పథకాలకు దీన్ని వర్తింపజేయడానికి సర్వం సిద్ధం చేశాం. ఆ 20 జిల్లాల్లో బకాయిలున్న ఏడు పథకాలకు జనవరి 1న నగదును బదిలీ చేస్తాం. ఆధార్ ఆధారిత వ్యవస్థ ద్వారా ఈ బదిలీ జరుగుతుందని అన్నారు.

లబ్ధిదారులెవరికైనా ఆధార్ నంబర్ లేకపోతే వారి బ్యాంకు ఖాతాకే నేరుగా నగదు బదిలీ చేస్తామన్నారు. తొలి దశలో రెండు లక్షల మందికి నేరుగా నగదు అందనుందని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మనీష్ తివారీ చెప్పారు. మంగళవారం నగదు బదిలీ చేయనున్న ఏడు పథకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఇందిరా గాంధీ మాతృత్వ సహాయత యోజన, ధనలక్ష్మి స్కీమ్, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు స్టయిఫండ్ మొదలగునవి ఉన్నాయన్నారు.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+