టాప్ 100 బెస్ట్ సీఈఓల జాబితాలో 8 మంది భారతీయలకు చోటు

భారతీయుల విషయానికి వస్తే 2010 ఫిబ్రవరి 1న మరణించిన ఓఎన్‌జీసీ సీఎండీ సుబీర్ రాహా 13వ స్థానంలో ఉండగా, రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ 28వ స్థానంలో నిలిచారు. ఎల్ అండ్ టీ ఎ.ఎం. నాయక్ (32వ స్థానం), భెల్ ఎ.కె. పూరి (38వ స్థానం), భారతీ ఎయిర్‌టెల్ సీఎండీ సునీల్ మిట్టల్ (65వ స్థానం), జిందాల్ స్టీల్ అండ్ పవర్ నవీన్ జిందాల్ (87వ స్థానం), సెయిల్ వి.ఎస్. జైన్ (89వ స్థానం)లు ఈ జాబితాలో చోటు సాధించారు.
ఇక ఈ జాబితాలో 17 ఏళ్లుగా అగ్రస్థానంలో నిలిచిన యాపిల్ వ్యవస్దాపక ఛైర్మన్ స్టీవ్ జాబ్స్‌కు ఈ ఏడాది కూడా మొదటిస్థానమే దక్కింది. అమెజాన్ డాట్‌కామ్‌కు చెందిన జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో శామ్‌సంగ్ యున్ జంగ్-యంగ్ ఉన్నారు. వేల్స్ కంపెనీ రోజర్ ఆగ్నెల్లి(4వ స్థానం), జిలీడ్ సెన్సైస్‌కు చెందిన జాన్ సి. మార్టన్(5), హ్యుందాయ్ మోటార్ కంపెనీ చుంగ్ మాంగ్-కూ(6), సిమన్ ప్రాపర్టీ గ్రూప్‌కు చెందిన డేవిడ్ సిమన్(8) స్థానాల్లో ఉన్నారు.
కంపెనీ సీఈవోలుగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 కాలం వరకూ సీఈవోల పనితీరు, వాటాదారులకు లభించిన రాబడులు, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదల, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించామని హెచ్‌బీఆర్ పేర్కొంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications