కేంద్ర ప్రభుత్వం నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 3004 కోట్లు

SBI
State Bank of India: Quotes, News
BSE 1019.55BSE Quote72.25 (-7.09%)
NSE 1019.30NSE Quote72.7 (-7.13%)
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు రూ. 3004 కోట్ల మూలధనం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన సహాయ పథకంలో భాగంగా ఎస్‌బిఐకి ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఎస్‌బిఐ సహా వివిధ పిఎస్‌యు బ్యాంకులకు రూ. 12వేల కోట్ల మూలధన సాయానికి ఆర్థికశాఖ ఇటీవల ఆమోదించడం తెలిసిందే.

ఈ ఏడాది బడ్జెట్‌లో పిఎస్‌యు బ్యాంకుల మూలధన పునర్‌వ్యవస్థీకరణ కోసం రూ.15వేల కోట్లు సమకూర్చాలని ప్రతిపాదించింది. తగిన అనుమతుజ తర్వాత పిఎస్‌యు బ్యాంకులకు నిధుల బదలాయింపు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మిగిలిన రూ.3,000 కోట్లపైనా త్వరలో నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. గతేడాది కూడా ప్రభుత్వం ఎస్‌బీఐకు రూ. 7,900 కోట్ల పెట్టుబడులను అందించింది. తద్వారా బ్యాంకులో ప్రభుత్వ వాటా 59.4% నుంచి 61.58%కు పెరిగింది. కాగా, టైర్-1 క్యాపిటల్ కోసం గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎస్‌బిఐకి 7900 కోట్ల సాయం అందించిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+