ట్రేడింగ్ నిబంధలు: సత్యం కంప్యూటర్స్ మాజీ అధికారికి రూ. 65 లక్షల జరిమానా

వివరాల్లోకి వెళితే సెబీ తెలిపిన వివరాల ప్రకారం.. 2008 డిసెంబర్ 15న మూర్తి 14,500 కంపెనీ షేర్లను విక్రయించారు. మరుసటిరోజు అంటే డిసెంబర్ 16న ఎంఐఎల్, ఎంపీఎల్‌ను కొనుగోలు చేస్తున్నట్లు సత్యం కంప్యూటర్స్ ప్రకటించింది. దీంతో 17వ తేదీన షేరు భారీగా 33.5 శాతం పతనమైంది. ఈ లావాదేవీ అంతా ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహార పరిధిలోకే వస్తుందని సెబీ పేర్కొంది.
14,500 షేర్ల అమ్మకాల ద్వారా మూర్తి రూ.21.54 లక్షల నష్టాలను నివారించుకోగలిగినట్లు సెబీ నిర్ధారించింది. ‘సత్యం' స్కామ్ తర్వాత ఆ కంపెనీని టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం, అనంతరం కంపెనీ పేరు మహీంద్రా సత్యంగా మారింది. ఇది ఇలా ఉంటే సత్యం కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన రూ. 822 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లను(ఎఫ్‌డీ)లను స్తంభింపజేస్తూ అటాచ్‌మెంట్ ఆదేశాలను ఇటీవల జారీ చేసింది.
ఆంధ్రాబ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్, ఐఎన్‌జీ వెైశ్యాబ్యాంకు లిమిటెడ్‌లలో సత్యం ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసింది. కంపెనీ మాజీ చెైర్మన్ బి రామలింగరాజుతో పాటు మిగిలిన వ్యక్తులు మనీ ల్యాండరింగ్ చట్టం కింద నేరం చేసినట్లు రుజులెైనందు వల్ల వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లను స్తంభింపజేసినట్లు హైదరాబాద్‌కు చెందిన ఈడీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications