కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల ప్రక్రియను వేగవంతం: ఆర్దిక మంత్రి

బ్యాంకింగ్ బిల్లు పాస్ అయినందున ఇక తాము లెసైన్స్‌ల ప్రక్రియపై మరింతగా దృష్టిపెడతామని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, లెసైన్స్‌లు ఎవరికి ఇవ్వాలన్న విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి పక్షపాతం ఉండబోదని, నిబంధనల రూపకల్పన పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చేతుల్లో ఉంటుందని చిదంబరం వివరించారు. ఎవరికి కొత్త లెసైన్స్ దక్కేదీ కూడా ఆర్‌బీఐ నిర్ణయం మేరకే జరుగుతుందన్నారు. బ్యాంకింగ్ బిల్లు ఆమోదం పొందడంతో కార్పోరేట్ సంస్దలైన టాటా, రిలయన్స్‌లాంటి బ్యాంకులను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
రాజ్యసభలో బ్యాంకింగ్ బిల్లుతో పాటు ఎన్ ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండ్ రీకవరీ ఆఫ్ డెబిట్స్ లా(సవరణ)బిల్లు 2012ను కూడా ఆమోదించింది. బీమారంగంతో పాటు పెన్షన్ రంగంలో సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. త్వరలోనే మీతో సమావేశమై బీమారంగం బిల్లుపై చర్చలు జరుపుతానని చెప్పానని ఆర్థికశాఖ మంత్రి పి.చిదంబరం చెప్పారు.
ఇది ఇలా ఉంటే ప్రపంచ టాప్-20 బ్యాంకుల్లో చైనా బ్యాంక్‌కు మూడో స్థానం లభించగా.. మనకు బ్యాంక్ మాత్రం ఒక్కటీ లేదు. కచ్చితంగా 2-3 ప్రపంచ స్థాయి బడా బ్యాంకులతో పాటు మరిన్ని బ్యాంకులు భారత్‌లో ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని చిదంబరం పేర్కొన్నారు. కాగా, బీమా, పెన్షన్ బిల్లును వచ్చే బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నట్లు చిదంబరం వెల్లడించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications