
ఐతే ఈ లెక్కలు తప్పంటూ చెబుతున్న మాల్దీవుల సర్కార్.. దీనిపై తాము ఫోరెన్సిక్ ఆడిట్‌కు వెళతామని, అప్పుడే మాలే ఎయిర్‌పోర్టు పేరిట జిఎంఆర్ ఏమేరకు నిధులు సమకూర్చుకుందీ, దీనిపై వాస్తవంగా ఎంత సొమ్ము ఖర్చుచేశారన్న విషయం తేటతెల్లమవుతుందని అన్నారు. కంపెనీ వ్యయాలపై మేం అంతర్జాతీయ సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్‌ను చేపట్టనున్నాం. అసలు మాలె అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ద్వారా జీఎంఆర్ ఖజానాకు ఎంత మొత్తం వెళ్లిందనే సమాచారం తెలియాల్సి ఉంది. మాకున్న సమాచారం మేరకు జీఎంఆర్ ఈ మాలె ఎయిర్‌పోర్టు ఆధునీకరణ, నిర్వహణ కాంట్రాక్టును చూపించి ఒక బ్యాంకు నుంచి 35 కోట్ల డాలర్ల మేర రుణాన్ని తీసుకుంది. ఇందులోభాగంగా 15 కోట్ల డాలర్లనే వెచ్చించిందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ వహీద్ ప్రెస్ కార్యదర్శి మసూద్ ఇమాద్ పేర్కొన్నారు.
ఐతే ఫోరెన్సిక్ ఆడిట్‌కు మీరు సిద్ధమేనా అని జీఎంఆర్ కపూర్‌ను ప్రశ్నించగా, మాలెక్కలు పారదర్శకంగా వున్నాయి. అలాగే మాల్దీవుల ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఫోరెన్సిక్ ఆడిట్ క్లాజు లేదని అన్నారు. అయినప్పటికీ ఆడిట్ పట్ల తమకు అభ్యంతరం లేదని, కానీ ఇది సరైన న్యాయప్రక్రియ ద్వారా జరగాలని తెలిపారు. కాగా, తమ లెక్కల ప్రకారం జిఎంఆర్ పరిహారం 150 మిలియన్ డాలర్లకు తగ్గకుండా, గరిష్టంగా 350 మిలియన్ డాలర్లు మించని విధంగా వుంటుందని మాల్దీవుల సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. 2010లో గత మాల్దీవుల ప్రభుత్వ హయాంలో జీఎంఆర్ ఇన్‌ఫ్రా కుదుర్చుకున్న మాలె కాంట్రాక్టు(విలువ దాదాపు రూ.2,600 కోట్లు)ను కొత్త ప్రభుత్వం గత నెల 27న రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications