టాటా గ్రూప్ చైర్మన్‌గా మరో రెండు వారాల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రతన్ టాటా.. ప్రస్తుతం వైస్ ఛైర్మన్‌గా ఉన్న తన వారసుడు సైరస్ మిస్త్రీకి ఎలా మెలగాలన్నదానిపై తర్ఫీదునిస్తున్నారు. తననో, మరొకరినో అనుకరించే ప్రయత్నం చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ‘నువ్వు నీలాగే ఉండు. నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ముందుగా నువ్వే నిర్ణయించుకో' అని మిస్త్రీకి విలువైన సూచనలు చేశారు. ఈ నెల 28తో 75 ఏళ్లు నిండనున్న రతన్ టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఆయన అన్ని విషయాలను పంచుకున్నారు. రతన్‌టాటాకు ఈ గ్రూపుతో 50 ఏళ్ల ప్రస్దానం, మిస్త్రీతో అనుబంధం... గ్రూపు ఛైర్మన్‌గా 21 ఏళ్ళు పని చేశారు. తన హయాంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. రిటైర్మెంట్ తర్వాత తన ప్రణాళికలు గురించి కూడా వివరించారు. 80 దేశాల్లో టాటా గ్రూపునకు చెందిన ఆటోమొబైల్స్, ఐటి, హోటల్స్, టీ, స్టీల్ రంగాల్లో అనేక గ్రూపులున్నాయి. ప్రస్తుతం మిస్త్రీ తనను తాను సన్నద్ధం చేసుకోవడానికి టాటాతో సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నారు.

కంపెనీ విజయాల బాటలో నడిచేందుకు విజయ మంత్రాన్ని మిస్త్రీకి ఉపదేశించారా అని ప్రశ్నించగా, 'నాకు బాధ్యతలు అప్పగించేటపుడు జెఆర్‌డి టాటా ఏవైతే నాకు చెప్పారో అవన్నీ ఇప్పుడు మిస్త్రీకి చెప్పాలనుకోవడం లేదు. కాకపోతే ఎవరైనా మొట్టమొదట జెఆర్‌డి టాటాలా ఉండాలనుకునే ఇక్కడకు వస్తారు. ఎందుకంటే ఆయన నిర్వహించిన బాధ్యతల్లోకి ఆడుగుపెడుతున్నాం. కానీ నేను ఆనాడే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అనుకున్నా. నేను అలా ఎన్నడూ చేయరాదనుకున్నా. దాంతో నాకు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నేను ఏది కరెక్ట్ అనుకుంటే అదే చేశా. ఇప్పుడు మిస్త్రీకి కూడా అదే చెపుతున్నా. నీకు ఏది సరైనది అనిపిస్తే అదే చేయి అని చెపుతున్నా' అని అన్నారు.
గ్రూప్‌లో తన సుదీర్ఘ ప్రస్థానంలో చికాకు కలిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని టాటా చెప్పుకొచ్చారు. ఏదైనా పనిని ప్రశ్నించుకోకుండా ఒకే రీతిగా చేసుకుంటూ పోవడం తనకు ఇష్టం ఉండదని .. అందుకే ప్రశ్నించమని, కొత్త ఐడియాలు సృష్టించమని సిబ్బందిని ప్రోత్సహిస్తూ ఉంటానని ఆయన పేర్కొన్నారు. గ్రూప్ ధోరణిని పూర్తిగా మార్చలేకపోయినా..కొంత వరకూ మార్చగలిగానని టాటా వివరించారు. తక్కువ కంపెనీలు, తక్కువ కార్యకలాపాలతో గ్రూప్‌ను మరింత పటిష్టంగా చేయదల్చుకున్నప్పటికీ ఎక్కువగా సఫలం కాలేకపోయానన్నారు.
గ్రూప్‌నకు తాను వారసత్వంగా ఇచ్చేవి.. తను కట్టుబడి ఉండేందుకు ప్రయత్నించిన విలువలు, నైతికతేనని టాటా వివరించారు. తాము నమ్మిన దానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. తాను అందర్నీ సమానంగా, సముచితంగా చూసేందుకు శాయశక్తులా ప్రయత్నించానని.. కానీ ఈ క్రమంలో కొందరి మనోభావాలను దెబ్బతీసి ఉండొచ్చని టాటా అభిప్రాయపడ్డారు. మొత్తం మీద.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తాను నమ్మిన దానికి కట్టుబడి ఉండేందుకు తాపత్రయపడిన వ్యక్తిగా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మీరు వైదొలగిన తర్వాత కూడా మీ సలహాలు, సూచనలు ఆయనకు అందుతాయా అని ప్రశ్నించగా... 'కచ్చితంగా. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయినా నిత్యం ఆయనతో సంబంధాలను కలిగిఉంటా. అవసరమైన చోట సూచనలు, సలహాలు ఇస్తా' అని చెప్పారు. ఆర్కిటెక్చర్‌పైనా, చిన్నప్పుడు నేర్చుకున్న పియానో మీద దృష్టి పెడతా. నాకెంతో ఇష్టమైన స్కూబా డైవింగ్‌ను నాలుగేళ్ల క్రితం వదులుకోవాల్సి వచ్చింది. జాగ్వార్, లాండ్ రోవర్ కార్ల తయారీ కంపెనీలకు అధిపతి అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో నన్ను అమితంగా ఆకట్టుకున్న కారు ఫెరారీ' అని రతన్ పేర్కొన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications