వాషింగ్టన్: ఈరోజు చైనా ఉన్న తరహాలో 2030 నాటికి భారత్ గొప్ప ఆర్దిక శక్తి దేశంగా ఆవిర్బవిస్తుందని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్ద - నేషనల్ ఇంటిలిజెన్స్ కౌన్సిల్ (ఎన్ఐసీ) "గ్లోబల్ ట్రెండ్స్ 2030: యాల్టర్నేటివ్ వరల్డ్స్" పేరుతో సోమవారం విడుదల చేసిన ఒక నివేదికలో ఈ మేరకు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం 8 నుండి 10 శాతం వృద్ది రేటును సాధిస్తున్న చైనా 2030 నాటికి ఆ స్దాయి వృద్దిని సాధించే పరిస్దితి ఉండకపోవచ్చునని తన నివేదికలో అంచనా వేసింది. ప్రస్తుతం చైనా సాధిస్తున్న వృద్ది రేటు స్థాయిని 2030లో భారత్ సాధిస్తుందని నివేదికలో పేర్కొంది.
భారత్-చైనా మధ్య ప్రస్తుతం ఉన్న ఆర్థిక అంతరం 2030 నాటికి ముగిసిపోతుందని... పాకిస్తాన్‌తో పోల్చితే భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రస్తుతం ఎనిమిది రెట్లు అధికంగా ఉందని, 2030 నాటికి ఇది తేలిగ్గా 16 రెట్లు అధిక స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడింది. జీడీపీ, జనాభా, సైనిక శక్తి, సాంకేతికపరమైన పెట్టుబడుల ప్రాతిపదికన ప్రపంచశక్తిలో 2030 నాటికి సంయుక్తంగా ఉత్తర అమెరికా, యూరప్‌ల పరిమాణాన్ని ఆసియా అధిగమిస్తుందన్న అభిప్రాయాన్నివ్యక్తం చేసింది.
నివేదికలో పేర్కొన్న అంశాలు:
* చైనాలో పని చేసే జనాభా సంఖ్య 2016లో శిఖర స్దాయికి చేరుకోవచ్చు. 2030 వచ్చే నాటికి ఇది 994 మిలియన్‌ల నుండి సుమారు 961 మిలియన్‌లకు పడిపోవచ్చు.
* అదే భారత్ విషయానికి వస్తే దీనికి భిన్నంగా పని చేసే వయసు ఉన్న వారి సంఖ్య 2050 నాటికి శిఖర స్దాయికి చేరే అవకాశం ఉంది.
* భారత్ ఆర్దిక వ్యవస్ద ఇప్పటికే పాకిస్దాన్ కన్నా సుమారు 8 రెట్లు పెద్దదిగా ఉంది. 2030కల్లా ఈ రెండు దేశాల మధ్య వృద్ది నిష్పత్తి 16:1 కన్నా మించే అవకాశం ఉంది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
2030 నాటికి ఆసియా ఆర్దిక శక్తి దేశంగా భారత్: అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ | India to outpace China by 2030: US intelligence report | 2030 నాటికి ఆసియా ఆర్దిక శక్తి దేశంగా భారత్: ఎన్ఐసీ
US intelligence community in a new report released on Monday says by 2030, a surging India, along with decelerating China, will straddle global commerce and dominate the world economy amid the gradual decline of the west.
Story first published: Tuesday, December 11, 2012, 15:14 [IST]
Other articles published on
Dec 11, 2012