న్యూఢిల్లీ: ప్రపంచంలోని 176 దేశాల అవినీతితో పోలిస్తే భారత్ రేటింగ్ 94వ స్దానంలో ఉన్నట్లు ట్రాన్స్‌పెరెన్సీ ఇంటర్నేషనల్స్ కరెప్షన్ పరసెప్షన్ ఇండెక్స్ (సీపీఐ) సంస్ద ప్రకటించింది. గత ఏడాది 183 దేశాలతో పోల్చి చూస్తే భారత్ 95వ స్దానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి అవినీతిని లెక్కించడానికి కొత్త ప్రాతిపదికను ఉపయోగించడం జరిగిందని కాబట్టి గత ఏడాది ర్యాంకింగ్‌తో దీన్ని పోల్చకూడదని తెలిపింది.

ఈ ఏడాది భారత్ అవినీతి 0 నుండి 100 స్కేలులో 36 స్కోరు చేసింది. 0 స్కోరు సాధిస్తే ఆ దేశం పూర్తిగా అవనీతిలో ఉన్నట్లు.. అదే 100 స్కోరు సాధిస్తే మొత్తం క్లీన్‌గా ఉన్నట్లన్నమాట. ఈ రేటింగ్ ఇవ్వడానికి మొత్తం 10 అధ్యయనాలు చేస్తారు. ప్రపంచ బ్యాంకు నిర్వహించే పర్ఫార్మేన్స్ అండ్ ఇన్టిట్యూషనల్ అసెస్‌మెంట్ అండ్ గ్లోబల్ ఇన్‌సైట్ కంట్రీ రిస్క్ రేటింగ్‌లో భారత్ 72వ స్థానం దక్కిం చుకుంది. మొత్తం 180 దేశాలతో పోలిస్తే 2007 తర్వాత భారత్ 72 వ స్థానం రావడం ఇదే తొలిసారి. గత కొన్ని సంవత్సరాల నుంచి దేశం ర్యాంకింగ్ దిగజారుతూ వస్తోంది. కాగా 2010లో 87వ స్థానంలో ఉండగా 2011లో 95వ స్థానం దక్కించుకుంది.
ఈ సంవత్సరం మన పొరుగు దేశాలైన శ్రీలంక, చైనా కంటే తక్కువ ర్యాంకుని సాధించినప్పటికీ... ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారత్ కంటే ఎక్కువ ర్యాంకులను దక్కించుకున్నాయి. శ్రీలంక 79వ ర్యాంకు కాగా చైనా 80 ర్యాంకు సాధించింది. డెన్మార్క్ అత్యధిక స్కోర్ 90 సాధించింది. దీనికి అతి సమీపంలో ఉన్న దేశాలు ఫిన్లాండ్, న్యూజిలాండ్‌లున్నాయి. చివరి ర్యాంకుల్లోదించిన మయన్మార్, సూడాన్, అఫ్ఘానిస్తాన్, సోమాలియా, ఉత్తర కొరియాలున్నాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications