
గత ఏడాది 3.06 శాతం ఉన్న మొండి బకాయిలు ఈ ఏడాది 4.06 శాతానికి పెరిగిపోయాయని ... పైన తెలిపిన కారణాల వల్ల బ్యాంకుల నిర్వహణా ఖర్చులు పెరిగిపోయి.. లాభాలు తగ్గుముఖం పడతాయని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ వినీత్ గుప్తా చెప్పారు. రుణాల డిమాండ్ పెరుగడంతో ఏడాదికి 15 శాతం చొప్పున వద్ధి చెందుతోందని.. అందుకు అదనంగా మూలధనం కావాల్సి వస్తుందని అన్నారు. అప్పుడు బ్యాంకులు కొత్తగా మూలధనం సమకూర్చుకు నేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుప్తా చెప్పారు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకులకు ప్రభుత్వం మూలధనం సమకూర్చుతుంది కాబట్టి కొంచెం లాభాలు ఆర్జించే అవకాశం ఉందని మూడీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
నిన్న మూడీస్ ప్రతినిధులు ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారామ్ మాట్లాడుతూ... ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)లతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 5.3 శాతానికి కట్టడి చేసేందుకు కట్టుబడి ఉన్నామని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌కు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనికి సబంధించిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగినన్ని నగదు నిల్వలు తమకు అందుబాటులో ఉన్నాయని కూడా పేర్కొంది.
కాగా, భారత్ రేటింగ్‌ను పెంచాల్సిందిగా తాము ఎలాంటి విజ్ఞప్తులూ చేయలేదని, ఇక్కడి ఆర్థిక పరిస్థితిని మాత్రమే వివరించామని ఆయన పేర్కొన్నారు. ఇక దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది వారేనని చెప్పారు. 2014 సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం సంస్కరణల అమలుపై వెనుకడుగు వేసినా, ఆర్థిక మందకొడి పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినా భారత్ సావరిన్ రేటింగ్ తగ్గిపోగలదని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ హెచ్చరించింది. ఫిచ్, స్టాండర్డ్ అండ్ పూర్స్ రెండూ ఈఏడాది మొదట్లో భారత ఆర్థికవ్యవస్థ అవుట్‌లుక్ ప్రతికూల స్థాయికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఫలితంగాబ్రిక్ దేశాల్లో జంక్ స్థాయికి రేటింగ్ డౌన్‌గ్రేడ్ అయిన దేశంగా భారత్ నిలిచింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications