రూ. 22 కోట్ల బకాయిలను చెల్లించకపోతే.. ముంబై టెర్మినల్ నుంచి కింగ్‌ఫిషర్ ఔట్..!

ప్రస్తుతం కింగ్‌ఫిషర్ సంస్దకు లీజుకిచ్చిన జాగాను వేరే విమానయాన సంస్దలకు ఇచ్చే విషయమై చర్చలు జరుగుతున్నాయని, ఐతే తుది నిర్ణయం తీసుకోలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే అక్టోబర్ 1న కింగ్ ఫిషర్ ప్లయింగ్ లైసెన్స్ రద్దుకావడంతో కింగ్‌ఫిషర్ తన విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కింగ్‌ఫిషర్‌కు రూ. 7,000 కోట్ల అప్పులున్నాయి.
ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పునరుద్దరణ ప్రణాళికను ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAకు సమర్పించే భాగంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవను కలిసి పరిస్దితిని ఆయనకు వివరించారు. రూ. 330 కోట్ల బకాయిలను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుండి రాబట్టుకోవడానికి రెవిన్యూ విభాగం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు రూ. 293 కోట్ల బకాయిలను వసూలు చేసుకునే ఉద్దేశ్యంతో చెన్నై, కోల్‌కత్తా విమానాశ్రయాల్లోని రెండు విమానశాలలను ఖాళీ చేయాలని కింగ్ ఫిషర్ ను భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్ద(ఏఏఐ) ఆదేశించింది.
మరిన్ని వసూళ్లకు పాల్పడకుండా ఆదాయపు పన్ను(ఐటీ) విభాగాన్ని నిరోధిస్తూ గత నెల 26న కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. దీంతో ఐటీ విభాగం కింగ్ ఫిషర్ బ్యాంకు ఖాతాల అటాచ్ మెంట్ ఆదేశాలను సడలించింది. ఐతే బకాయిల వసూళ్ల కోసం ఎలాంటి రికవరీ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వును కొట్టివేయాలని కోరుతూ ఆదాయపు పన్ను శాఖ, సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్‌లు సంయుక్తంగా ఈ ఎస్‌ఎల్‌పీని దాఖలు చేయనున్నాయి. ఈ రెండూ కూడా రెవిన్యూ విభాగానికి చెందనవి కావడం విశేషం. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్ద ఐటీ డిపార్ట్ మెంట్‌కు రూ. 269 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్‌కు రూ. 60 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications