జీఎంఆర్‌ సంస్దకి మాలె ఎయిర్‌పోర్ట్ లీజుపై ఎంఏసీఎల్ పోలీసులకు ఫిర్యాదు

GMR
మాలె: ఇన్‌ఫ్రా దిగ్గజం జీఎంఆర్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. జీఎంఆర్ సంస్దకి మాలె అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లీజుకివ్వడం చట్టవిరుద్దంగా జరిగిందంటూ మాల్దీవుల ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ (ఎంఏసీఎల్) మాల్దీవుల పోలీసులకి ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో జీఎంఆర్ సంస్దకి ఎయిర్ పోర్టు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టాలు రావడం, ఎయిర్ పోర్ట్ డెవలప్‌మెంట్ చార్జీల క్రింద 25 డాలర్లు వసూలు చేసుకునేలా జీఎంఆర్ సంస్దకి అధికారాలివ్వడం మొదలైన ఉల్లంఘనలు జరిగాయని పేర్కోంది.

గత ప్రభుత్వం హయాంలో కొందరు సీనియర్ అధికారులు, కంపెనీలోని కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ అవకతవకలకు పాల్పడ్డారని ఎంఏసీఎల్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై మాల్దీవుల అవినీతి నిరోధక శాఖ కమీషన్ కూడా విచారణ జరుపుతుంది. ఇటీవలే మాల్దీవుల ప్రభుత్వం సమావేశమై మాలే విమానాశ్రయం కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు మాల్దీవ్‌ అధ్యక్షుడు ప్రెస్‌ కార్యదర్శి మసూద్‌ ఇమావ్‌ ఒక ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నహీద్‌ అధికారంలో ఉన్నప్పుడు జీఎంఆర్‌ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

జీఎంఆర్ కాంట్రాక్టు రద్దు వల్ల భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు వచ్చిన ముప్పుఏమీ లేదని మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీల్ గత ప్రభుత్వ హయాంలో కుదర్చుకున్న ఒప్పందం కావడం కాగా.. ఈ డీల్ మా ప్రభుత్వానికి సందేహాస్పదంగా ఉండటం వల్ల దీనిని రద్దు చేయడం జరిగిందని, మిగతా కంపెనీల కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. మాలె అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి జీఎంఆర్ కాంట్రాక్టును ఇటీవల మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

మాల్దీవుల్లో జీఎంఆర్ గ్రూప్ చేపట్టిన విమానాశ్రయం కాంట్రాక్టు రద్దు అవ్వడానికి కారణం '25 డాలర్ల ఎయిర్‌పోర్ట్‌ డెవెలప్‌మెంట్‌ చార్జ్' కారణం అని అంటున్నారు. మాల్దీవ్‌ ప్రభుత్వం జీఎంఆర్‌లో జూన్‌ 2010లో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 2012 నుంచి మాలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుండి సర్వీసు చార్జీ 25 డాలర్లతో పాటు రెండు డాలర్లు బీమా సర్‌చార్జీ వసూలు చేయాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు ఈ ఒప్పందం అమలు కాలేదని జీఎంఆర్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వంతో జీఎంఆర్‌ కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిందని మాలే ప్రభుత్వం ఆరోపిస్తోంది.

తాము ఇప్పటి వరకు ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయకపోయినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం లేవీ విధించరాదని తమకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అంతేకాకుండా మాల్దీవుల ప్రభుత్వం తాము ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ కాంట్రాక్టు రద్దు చేయడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి 2010లో మాల్దీవ్‌ ఆర్థికశాఖమంత్రి అబ్దుల్లా జిహాద్‌ కుదర్చుకున్న ఒప్పందంలో డెవెలప్‌మెంట్‌ చార్జీలు వసూలు చేసుకో వచ్చునని ఒప్పందం జరిగింది.

తెలుగు వన్ఇండియా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+