
ప్రభుత్వ పాలసీ రేట్లలో కొంత తగ్గుదల వల్ల ప్రస్తుతం ఉన్న కఠిన ద్రవ్య పరిస్దితులు తొలగిపోయి, కొత్త సంస్కరణలను కొనసాగించడం వల్ల పెట్టుబడిదారుల్లో పెరిగే విశ్వాసం, వ్యవసాయ దిగుబడుల్లో పెరుగుదల దీనికి కారణమని తెలిపింది. అదే 2015-2016 నాటికి వృద్ది రేటు మరింత మెరుగుపడుతుందని కూడా తన అంచనాలో తెలిపింది. దీనితో పాటు వచ్చే ఏడాది చివరికి నిఫ్టీ ఇండెక్స్ 14 శాతం పెరిగి 6,600కు చేరవచ్చని నివేదికలో పేర్కొంది. ఇక 2013 డిసెంబర్ నాటికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ 23,069 పాయింట్ల స్దాయికి చేరవచ్చని నవంబర్ 26 నివేదికలో మోర్గాన్ స్టాన్లీ వేసిన అంచనాతో ఏకీభవించింది.
ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును ప్రదర్శిస్తుందని అంచనా వేసిన నివేదిక, రాబోయే కాలంలో మాత్రం నిరాశాజనక పరిస్థితి తప్పదని విశ్లేషించింది. 2012లో వృద్ధి రేటును 5.4 శాతంగా అంచనా వేస్తోంది. అధిక ద్రవ్యోల్బణం, ద్రవ్య, కరెంట్ అకౌంట్ల లోటు, బలహీన వృద్ధి వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ రెండవ త్రైమాసిక గణాంకాలు (జూలై-సెప్టెంబర్) ఈరోజు విడుదల కానున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు భారత్ ఆర్థిక వృద్ధి 8-9 శాతం శ్రేణికి చేరింది. 2011-12లో తొమ్మిది సంవత్సరాల కనిష్ట స్థాయి 6.5 శాతానికి జారింది. 2012 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో వృద్ధి 5.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications