
మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. ప్రతిపాదించిన రూ. 50,000 కోట్ల పెట్టుబడుల్లో రూ. 24,000 కోట్లను వచ్చే ఐదు సంవత్సరాల్లో భారీ యంత్ర పరికరాలు, ఉత్పత్తిని పెంచే సామాగ్రి కొనుగోలుకు కంపెనీ ఉపయోగిస్తుందని కోల్ ఇండియా కంపెనీ సీఎండీ ఎన్ నర్సింగ్ రావు తెలిపారు. మిగిలిన సగ భాగాన్ని వందకు పైగా భూగర్బ, ఓపెన్ కాస్ట్ గనుల అభివృద్దికి వినియోగించనుంది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతానికి పైగా వాటా కలిగిన కోల్ ఇండియా 22 కొత్త వాషర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
దీనితో పాటు దక్షిణాఫ్రికాలో గనుల కొనుగోలు చర్చలు జరుగుతున్నాయని, ఇది ప్రాధమిక దశలో ఉన్నాయని నర్సింగ్ రావు తెలిపారు. వీటితో పాటు రూ. 7,500 కోట్లను రైల్వే మౌఖిక సదుపాయాల అభివృద్దికి కంపెనీ కేటాయించనుందని అన్నారు.
ప్రైస్ పూలింగ్ ప్రతిపాదన కింద కొన్ని విద్యుత్ ఉత్పాదక సంస్థలకు దిగుమతి చేసుకున్న బొగ్గును సబ్సిడీపై సరఫరా చేసేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే దీనివల్ల తమ సంస్థకు రాబడి నష్టాలు రాకుండా వుండాలని కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) పేర్కొంది. అయితే బొగ్గు దిగుమతి దేశీయ పవర్ సెక్టార్ సమస్యలకు పరిష్కారం కాదని, మెజారిటీ పవర్ ప్లాంట్లు స్వదేశీ బొగ్గు ఆధారంగా డిజైన్ చేసి వున్నాయని ఆయన అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థ, వినియోగదారు, రెగ్యులేటర్ ఇలా ప్రైస్ పూలింగ్ విధానాన్ని అందరూ ఆమోదించాల్సి వుందని అన్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications