
మాల్దీవుల్లో జీఎంఆర్ గ్రూప్ చేపట్టిన విమానాశ్రయం కాంట్రాక్టు రద్దు అవ్వడానికి కారణం '25 డాలర్ల ఎయిర్‌పోర్ట్ డెవెలప్‌మెంట్ చార్జ్' కారణం అని అంటున్నారు. మాల్దీవ్ ప్రభుత్వం జీఎంఆర్‌లో జూన్ 2010లో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 2012 నుంచి మాలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుండి సర్వీసు చార్జీ 25 డాలర్లతో పాటు రెండు డాలర్లు బీమా సర్‌చార్జీ వసూలు చేయాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు ఈ ఒప్పందం అమలు కాలేదని జీఎంఆర్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వంతో జీఎంఆర్ కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిందని మాలే ప్రభుత్వం ఆరోపిస్తోంది.
తాము ఇప్పటి వరకు ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయకపోయినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం లేవీ విధించరాదని తమకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అంతేకాకుండా మాల్దీవుల ప్రభుత్వం తాము ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ కాంట్రాక్టు రద్దు చేయడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి 2010లో మాల్దీవ్ ఆర్థికశాఖమంత్రి అబ్దుల్లా జిహాద్ కుదర్చుకున్న ఒప్పందంలో డెవెలప్‌మెంట్ చార్జీలు వసూలు చేసుకో వచ్చునని ఒప్పందం జరిగింది.
మాల్దీవుల ప్రభుత్వం కూడా జీఎంఆర్ ఇప్పటి వరకు డెవెలప్‌మెంట్ చార్జీలు వసూలు చేయలేదని అయినప్పటికీ.. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జీఎంఆర్‌కు మాల్దీవ్ ప్రభుత్వం నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో జీఎంఆర్ మాలే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీఎంఐఎల్)ను వారంలోగా పూర్తి చేసి మాల్దీవ్ ఎయిర్ పోర్ట్ కంపెనీ లిమిటెడ్(ఎంసీసీఎల్)కు అప్పగించాలని మాలే ప్రభుత్వం జీఎంఆర్ కన్సార్టియంను ఆదేశించిది. ఎంఏసీల్ కూడా తమకు వచ్చే రెవెన్యూ జీఎంఆర్ కన్సార్టియం కొంత భాగం ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications