
డెక్కన్ క్రానికల్ హొల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) కంపెనీ నుండి ఈ రెండు సంస్దలకు సుమారుగా చెరో రూ. 100 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. డీసీహెచ్‌ఎల్‌కు అప్పలిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్, ఐఎఫ్‌సీఎల్, హాంకాంగ్‌కు చెందిన అడోనీస్ గ్రూపులు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీకి సుమారు రూ. 5,000 కోట్లకు పైగా రుణభారం ఉందని సమాచారం.
ప్రభుత్వ సమాచారం ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 1,090 కోట్లు, ప్రైవేటు బ్యాంకులు రూ. 1,200 కోట్ల విలువైవ రుణాలను డెక్కన్ క్రానికల్ హొల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్)కు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇతర ప్రైవేటు ఫైనాన్స్ సంస్దల నుండి సుమారు రూ. 2,500 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. లిస్టెడ్ కంపెనీ అయిన డెక్కన్ క్రానికల్ హొల్డింగ్స్ లిమిటెడ్ ఆర్దిక కష్టాల్లో ఉన్నప్పటికీ విజయవంతంగా నడుస్తుండడంతో కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ సంస్దలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్)పై ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక రాగానే తదుపరి చర్యల గురించి ఆ సంస్దకు రుణాలిచ్చిన బ్యాంకులన్నీ కలిసి నిర్ణయం తీసుకుంటాయని కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏకె గుప్తా తెలిపారు. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) ఖాతాలకు సంబంధించి ఫోర్జరీ, నకిలీ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ప్రముఖ ఆడిట్ సంస్ద డెలాయిట్‌తో ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ నెల చివరి కల్లా ఆడిట్ పూర్తయి.. పూర్తి నివేదిక రాగానే లీగల్ చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ విషయంలో మిగతా బ్యాంకులు కూడా మాకు సహాకరించే భాగంలో వాటితో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. కెనరా బ్యాంకుతో పాటు కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌లు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు సుమారు రూ. 5000 కోట్లకుపైగా రుణాలిచ్చాయి. కెనరా బ్యాంక్ డీసీహెచ్‌ఎల్‌కు రూ. 330 కోట్ల రుణాలిచ్చినట్లు.. అందులో రూ. 225 కోట్లు మొండి బకాయిలుగా తమ బ్యాంక్ Q2 లాభనష్టాల్లో చూపించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications