
రాబోయేకాలంలో అన్ని పది రూపాయల నోట్లను తీసివేసి వాటి స్దానంలో నాణేలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్దికశాఖ సహాయ మంత్రి నమో నారాయణ్ మీనా లోకసభలో నిన్న ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఐతే మనదేశంలో 2009 నుండి పది రూపాయల నాణేలు పాక్షికంగా చెలామణిలో ఉన్నాయి. ఐతే పది రూపాయల నాణేల సరఫరా దేశంలోని మింట్‌ల సామర్థ్యంపై ఆధారపడి వుంటుందని అన్నారు.
పది రూపాయల నోటు సగటు లైఫ్ కేవలం 9 నుంచి 10 నెలలు మాత్రమే కాగా, ఒక్కో పది నోటు ప్రింటింగ్ కోసం 96 పైసలు ఖర్చు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిందని ఆర్దిక మంత్రి తెలిపారు. పది రూపాయల నాణెం తయారీకి ఒక్కోదానికి రూ.6.10 ఖర్చు అవుతుందన్నారు. అయినప్పటికీ పది నోట్ల లైఫ్ వ్యవధి తక్కువ కావడం వల్ల నోట్ల ప్రింటింగ్ ఖర్చే ఎక్కువని అన్నారు.
ఇక ఆర్థికమంత్రి చిదంబరం లోకసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కరెన్సీ నోట్ల ముద్రణలో మనదేశం స్వయం సమృద్ధి సాధించిందని.. దేశంలో మొత్తం అవసరాలకి వివిధ డినామినేషన్లలో సుమారు 17,600 మిలియన్ బ్యాంక్ నోట్ల ముద్రణ జరుగుతుందన్నారు. ఈ ముద్రణ మనదేశంలోనే నాలుగు ప్రెస్సుల ఆధ్వర్యంలో జరుగుతోందని మంత్రి తెలియజేశారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications