
దీంతో ముందుగా డిమాండ్ అదనంగా ఉంటే 5.59 శాతం వాటా (గ్రీన్‌షూ ఆప్షన్)లో 1.58 శాతం వాటాను కూడా ప్రభుత్వం విక్రయించడం విశేషం. దీంతో మొత్తం 5.58 శాతం వాటాను అమ్మింది. ఓపక్క డిజిన్వెస్ట్‌మెంట్లో వాటా విక్రయం సూపర్‌హిట్ ఐతే.. మరోపక్క స్టాక్ మార్కెట్‌లో ఈ కంపెనీ షేరు ధర 20% పడిపోయంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు భారీగా క్షీణిస్తూ ఒకదశలో లోయర్ సర్క్యూ ట్ పరిధికి చేరింది. మార్కెట్ ధర కంటే 41% డిస్కౌంట్‌తో ప్రభుత్వం ఈ సంస్థలో నాలుగు శాతం వాటాను విక్రయంచింది. కంపెనీ షేరు పతనం వల్ల సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.5వేల కోట్లు తగ్గిపోయంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 19,711 కోట్లకు పరిమితమైంది.
హిందుస్తాన్ కాపర్ వాటా కొనుగోలుకి దాఖలైన అత్యధిక శాతం బిడ్స్‌ను ప్రభుత్వరంగ దిగ్గజాలు ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ తదితరాలు దాఖలు చేశాయి. ఈ ఆఫర్ తరువాత కంపెనీలో ప్రభుత్వ వాటా 94%కు పరిమితమైంది. ఇక బిడ్డింగ్‌లో పాల్గొన్న మిగతా సంస్థాగత ఇన్వెస్టర్ల వివరాలు సోమవారానికి వెల్లడవుతాయని డిజిన్వెస్ట్‌మెంట్ కార్యదర్శి హలీమ్ ఖాన్ చెప్పారు.
ఇది ఇలా ఉంటే హిందుస్తాన్ కాపర్‌లో 4% ప్రభుత్వ వాటాల ఉపసంహరణను విజయవంతంగా చేపట్టిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 30,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హిందుస్తాన్ కాపర్ వాటా విక్రయానికి పూర్తిస్థాయిలో బిడ్స్ లభించడం సంతోషంగా ఉందని ఆర్దిక మంత్రి చిదంబరం అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications