కొచ్చి: దేశంలో ఇస్లామిక్ బ్యాంకును ప్రారంభించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఇస్లామిక్ బ్యాంక్ ప్రారంభించాలని విజ్ఞప్తిలో కొంత వాస్తవిక అంశాలు ఉన్నప్పటికీ.. ఇందుకు కొన్ని న్యాయపరమైన అవరోధాలు ఉన్నట్లు చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇస్లామిక్ బ్యాంకింగ్‌కు ప్రత్యేక చట్టం అవసరం అని అన్నారు. ఐతే ఇస్లామిక్ బ్యాంకింగ్ చట్ట ప్రకారం ఎన్‌ఆర్‌ఐ నిధులను దేశంలోకి అనుమతించే విషయం పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

అసలు ఇస్లామిక్ బ్యాంక్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే గురువారం కొచ్చిలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో కలిసి 'అందరికీ బ్యాంకింగ్ సేవలు' పధకం క్రింద దేశంలోనే 100 శాతం బ్యాంకింగ్ సేవలందిస్తున్న తొలి జిల్లాగా ఎర్నాకుళం అవతరించిన నేపధ్యంలో ఆయన కొచ్చికి వచ్చారు. ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తనతో మాట్లాడుతూ కేరళకు చెందిన ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) రాష్ట్రాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు పంపిస్తామని చెబుతున్నారని ... అయితే నిధులు రప్పించడానికి ఒక యంత్రాంగం కావాలని కోరారని.. దీని కోసం ఇస్లామిక్ బ్యాంకు లాంటి ప్రతిపాదనను చేయాలని కోరడంతో ఇది సాధ్యపడదని అన్నారు.
ఎర్నాకులంలో జనాభా 32 లక్షలు ఉంటే ఇక్కడి 37 లక్షల బ్యాంకు ఖాతాలున్నాయని ఆయన అన్నారు. ప్రజల్లో బ్యాంకింగ్ పట్ల అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్‌షిప్పులు, సబ్సీడీలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతాయని ఆయన దీని వల్ల సబ్సిడీలు కానీ స్కాలర్‌షిప్పు దుర్వినియోగానికి తావుండదని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ ముందున్న అసలు సవాలు ప్రజలకు బ్యాంకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయడమేనని అన్నారు.
ఇక ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతూ తమ తదుపరి ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం డిసెంబర్ 18వ తేదీన ఉందని.. చివరి సమీక్షా సమావేశం అక్టోబర్ 30 తేదీన జరిగింది. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందు వల్ల వడ్డీరేట్లను తగ్గిం చలే పోతున్నామని చెప్పారు. దీనికి బదులుగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను 0.25 శాతం తగ్గించి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.17,500 కోట్ల చలామణి అయ్యేలా చూశామని చెప్పారు.
ఇదే కార్యక్రమానికి హాజరైన యూఐడీఏఐ చైర్మన్ నందన్ మాట్లాడుతూ బ్యాంకుల్లో ఆధార్ కార్డును కెవసీ నిబంధనలకు అనుమతించాలని కోరారు. వాటిని గుర్తింపు కార్డులుగా గుర్తించాలని నందన్ నిలేకని కోరారు. ఆధార్ కార్డుల ఆధారంగా బ్యాంకు ఖాతాల ద్వారా సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే మళ్లిస్తామని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications