
డిసెంబర్ 10వ తారీఖున ఉదయం 11 గంటలకు కంపెనీ తరుపున అడ్వకేట్ లేదా అధికార ప్రతినిధి హాజరు కావాలని పేర్కొంది. ఈ నోటీసులపై స్పందించడానికి మహీంద్రా సత్యం ప్రతినిధి నిరాకరించారు. సత్యం కంప్యూటర్స్ స్కామ్ తర్వాత ఆ కంపెనీని టెక్ మహీంద్రా కొనుగోలు చేసి మహీంద్రా సత్యంగా మార్చిన విషయం తెలిసిందే.
సత్యం కంప్యూటర్స్ వ్వవస్తాపక ఛైర్మన్ రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులపై ఆర్దిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగానే సత్యం కంప్యూటర్స్ హాయాంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై గత నెల 18న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహీంద్రా సత్యంకి చెందిన ఎప్‌డీలను జప్తు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. రామలింగరాజు ఆయన సహచరులు కంపెనీ ఆదాయాలను పెంచి చూపి అక్రమంగా షేర్లను విక్రయించడం లేదా తనఖా పెట్టడం ద్వారా సొమ్ము చేసుకున్నట్లు తమ విచారణలో తేలినట్లు ఈడీ పేర్కొంది.
రామలింగ రాజు తన బినామీ సంస్థల ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 822 కోట్లను సత్యం కంప్యూటర్స్‌లోకి మళ్లించినట్లు ఈడీ తెలిపింది. దీంతో సంబంధిత అకౌంట్లను స్తంభింప చేసినట్లు ఈడీ తన ఆదేశాల్లో పేర్కొంది. నిబంధనల ప్రకారం ఆదేశాలు ఇచ్చిన 30 రోజుల్లోగా పీఎంఎల్‌ఏ కేసుల విచారణ న్యాయస్థానం వద్ద ఈడీ తమ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే రామలింగరాజు కంపెనీలోకి తెచ్చారంటున్న నిధులకు తమకు సంబంధమే లేదని మహీంద్రా సత్యం చైర్మన్ వినీత్ నయ్యర్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications