ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ప్రపంచంలోని ఇతర దేశాలకు వెళ్లిన వ్యక్తులు స్వదేశంలోని తమ వారికి డబ్బు (రెమిటెన్సులు) పంపే విషయంలో ఇండియా ఈ ఏడాది అగ్రస్దానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంక్ పేర్కొన్న నివేదిక ప్రకారం ఇండియాకు ఈ తరహా డబ్బు ఈ ఏడాది రికార్డు స్దాయిలో 70 బిలియన్ డాలర్లు (డాలర్‌కు రూ 55 చొప్పున రూ. 3,85,000 కోట్లు) చేరే అవకాశం ఉందని తెలిపింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 6.5 శాతం పెరిగినట్లు తెలిపింది.
అభివృద్ది చెందుతున్న దేశాలు మొత్తం కలిపి రెమిటెన్సులు తరహాలో మొత్తం 406 బిలియన్లు అందుకున్నాయని తెలిపింది. 70 బిలియన్ డాలర్లతో ఇండియా నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకోగా.. 66 బిలియన్ల డాలర్లతో చైనా రెండవ స్దానంలో నిలవగా.. మెక్సికో, ఫిలిఫ్పైన్స్ 24 బిలియన్ల డాలర్లతో మూడవస్దానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్దానాల్లో నైజీరియా, ఈజిప్ట్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం, లెబనాన్‌లు ఉన్నాయి.
అధికాదాయ దేశాలు సహా మొత్తం ప్రపంచ వ్యాప్త రెమిటెన్సుల పరిమాణం 2013లో 7.9 శాతం, 2014లో 10.7 శాతం, 2015లో 10.7 శాతానికి సుమారు 534 బిలియన్ డాలర్లను తాకవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
ఈ ఏడాది రెమిటెన్సుల్లో ఇండియా నెంబర్ వన్: ప్రపంచ బ్యాంక్ | Developing Countries remittance increase; India tops the list | రెమిటెన్సుల్లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్న భారత్
Remittance flows in the developing countries are expected to exceed earlier estimates and total $406 billion this year, an increase of 6.5% over the previous year, according to a new World Bank.
Story first published: Thursday, November 29, 2012, 9:47 [IST]