
ఫార్చ్యూన్ మ్యాగజైన్ 2012 సంవత్సరానికి ఎంపిక చేసిన జాబితాలో అమేజాన్ వ్యవస్దాపకుడు సీఈవో జెఫ్ బెజోస్ టాప్ ర్యాంక్ సాధించగా... ఆపిల్ సీఈవో టిమ్ కుక్ రెండో స్దానంలో నిలిచారు. ఇక భారత సంతతికి చెందిన మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా 8వ ర్యాంక్, ఐసిఐసిఐ సీఈవో చందా కొచ్చర్ 18వ ర్యాంక్‌లలో నిలిచారు. వీరిద్దరితో పాటు మరో భారత సంతతికి చెందిన వ్యక్తి మెటా క్యాపిటల్ మేనేజ్‌మెంట్ వ్యవస్దాపకుడు దీపక్ నరూలా 36వ ర్యాంక్ సాధించాడు.
ఇది ఇలా ఉంటే చందా కొచ్చార్ ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు వారెన్ బఫెట్ కన్నా ఒక ర్యాంక్ పైన నిలవడం గమనార్హం. బంగా మాస్టర్‌కార్డ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన పనితీరు పట్ల ఇన్వెస్టర్లు ఎంతో సంతృప్తి చెందినట్లుగా ఫార్చ్యూన్ మ్యాగజైన్ పేర్కొంది. అజయ్ బంగా మాస్టర్ కార్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టాక రెండేళ్ల వ్యవధిలో సంస్థ షేరు ధర రెట్టింపుకన్నా పెరిగిందని తెలిపింది. మాంద్యం పరిస్థితుల్లోనూ బుల్లిష్ ధోరణితో ఐసిఐసిఐ బ్యాంక్‌ను ముందుకు తీసుకువెళుతున్న కొచ్చార్‌ను ఫార్చ్యూన్ ప్రశంసించింది.
ఇటీవల విడుదల చేసిన భారతదేశపు వాణిజ్య రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తగా ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ నిలిచారు. ఫార్చున్ మ్యాగజైన్ ఎంపిక చేసిన ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది ఆమె మొదటి స్దానంలో నిలిచి రికార్డు సృష్టించారు. 'టాఫె' సంస్థకు చెందిన మల్లికాశ్రీనివాసన్, క్యాప్ జెమినీ ఇండియాకు చెందిన అరుణా జయంతి రెండు, మూడవ స్థానాల్లో నిలిచారు. పార్చున్ మ్యాగజైన్ 50 మందితో రూపొందించిన జాబితాలో ఈ సారి ఆరుగురు కొత్తవారు స్థానం సంపాదించారని 19 మంది ర్యాంకులు మెరుగుపర్చుకోగా, 17 మంది ర్యాంకులను దిగజార్చుకున్నారని ఫార్చ్యూన్ ఇండియా ఎడిటర్ దివ్యేంద్రనాథ్ ముఖర్జీ వెల్లడించారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications