
గురువారం కొత్త బ్యాంకింగ్ లైసెన్సుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఖరారు చేస్తుందని, దరఖాస్తుల స్వీకరణను ప్రారంభిస్తుందని ఆశిస్తున్నామని ఆర్దిక మంత్రి చిదంబరం చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరిసారిగా 2002లో కొత్త ప్రైవేట్ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు 1990 దశకం మధ్యలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకులను ఏర్పాటు చేసుకోనిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్‌లు ఏర్పాటు చేసే బ్యాంకులతో సహా కొత్త బ్యాంకుల ప్రవేశానికి గాను 2011 ఆగస్టులో తుది మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.
కాని ఈ విషయంలో ముందుకు సాగడానికి అవసరమైన చట్టబద్ధమైన అధికారాల కోసం ఆర్‌బిఐ నిరీక్షిస్తోంది. వాస్తవానికి బ్యాంకు లెైసెన్సులను 2008-09 సంవత్సరంలోనే జారీ చేయవలసి ఉంది. ‘బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా మేము ఆ లాంఛనాలను పూర్తి చేస్తున్నామని దువ్వూరి వ్యాఖ్యానించారు. వీలెైతే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో లేదా బడ్జెట్ సమావేశాలలో చట్టం సవరణ జరిగి తీరుతుందని నేను ఆర్‌బిఐకి హామీ ఇచ్చాను' అని చిదంబరం గురువారం ఢిల్లీలో చెప్పారు. అయినా, ఆర్‌బిఐ దరఖాస్తుల స్వీకరణను, వాటి ప్రాసెసింగ్‌ను ప్రారంభించినా, మొదటి బ్యాంకింగ్ లెైసెన్సు ఆ తదుపరి ఆరెనిమిది మాసాలలో జారీ కాకపోవచ్చని కూడా మంత్రి సూచించారు. ‘అందువల్ల లెైసెన్సు జారీ అయి, బ్యాంకులు ఆవిర్భవించే సమయానికి చట్టం సవరణ జరిగి ఉంటుంది' అని చిదంబరం చెప్పారు.
ప్రతిపాదిత సవరణలు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టే ప్రైవేటు కంపనీలపై పర్యవేక్షణ అధికారాలను ఆర్‌బీఐకి సంక్రమిస్తాయి. ప్రత్యేకించి, ఏవైనా అవకతవకలు జరిగిన పక్షంలో ఏదైనా కొత్త బ్యాంకింగ్ కంపెనీ బోర్డును రద్దు చేసేందుకు తగిన చట్టపరమైన అధికారాలను తనకు అప్పగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరుతోంది. అలాగే 5 శాతానికి మించి షేర్లను కోనుగోలు చేయాలనుకొంటే అనుమతించే అధికారాన్ని తనకు కట్టబెట్టాలని కూడా ఆర్‌బీఐ ఆశిస్తోంది.
అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం రేటు 7.45 శాతానికి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణం 7.45 శాతం స్దాయి చాలా ఎక్కువ. ఐతే వృద్ది రేటు పడిపోతుండటంపైన కూడా మేం చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. 2012-13 సంవత్సరానికి తదుపరి మధ్య త్రైమాసిక ద్రవ్య విధానం సమీక్ష డిసెంబర్ 18న జరగనున్నది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications