న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ (పిఎస్‌యు) బ్యాంకులకు కొత్తగా మూలధనం సమకూర్చే ప్రణాళికను మరికొద్ది వారాల్లో ఖరా రు చేయడంతో పాటు, అర్హులైన విద్యార్దులందరికీ విద్యారుణాలను ఖచ్చితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. నిన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పిఎస్‌యు బ్యాంకుల మూలధన విస్తరణకు, బ్యాంకుల రుణ వితరణ సామర్థ్యం పెంపొందించేందుకు కేంద్రం రూ.15వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించడం తెలిసిందే. కొత్తగా మూలధనం సమకూర్చే విషయాన్ని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది.

దీనితో పాటు త్వరలో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ స్కీమ్‌పై 7 - 10 రోజుల్లో కేబినెట్ నోట్‌ను సిద్దం చేయనున్నామని, మంత్రివర్గం ఆమోద ముద్ర అనంతరం ఇది మొదలవుతుందన్నారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అమల్లోకి వస్తే బ్యాంకులకు మరింత వెసులుబాటు లభించడంతో పాటు విద్యా రుణాల విభాగంలో బ్యాంక్‌ల నుండి రుణ వితరణ మిరింతగా పెరుగుతుందని అన్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డులు ఏటీఎం కార్డులుగా మార్పు:
కిసాన్ క్రెడిట్ కార్డులు అన్నింటినీ 2014 మార్చి నాటికి ఏటీఎం కార్డులుగా మార్చనున్నట్లు చిదంబరం వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకులకు నిర్దిష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. నాబార్డ్ గణాంకాల ప్రకారం 2012 మార్చి 31 నాటికి 11.39 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను బ్యాంకులు జారీ చేశాయి. 1998 నుండి 99లో పథకం ప్రారంభం నుండీ రూ. 5,21,617 కోట్ల రుణాలను బ్యాంకులు మంజారు చేశాయి. అర్హులైన రైతులు అందరికీ కార్డులను జారీ చేయాలని ఆర్దిక మంత్రిత్వ శాఖ బ్యాంకింగ్ వ్యవస్దను ఆదేశించింది. ఈ ఏడాది వ్యవసాయరంగానికి లక్ష్యంగా పెట్టుకున్న రూ. 5.75 లక్షల కోట్ల రుణ వితరణ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు.
ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధులు:
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగి పోతున్న మొండి బకాయిలు (ఎన్‌పీఏ)ల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌పీఏలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థ మందగించడమేనని అన్నారు. త్వరలోనే మొండి బకాయిల బెడద తప్పించడానికి ప్రభుత్వం సహాయ సహకారాలందిస్తుందన్నారు. దీనికి ప్రధా న కారణం మౌలికరంగం, ఉక్కు, నిర్మాణరంగం, జౌళి, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో జోరు తగ్గడమేనని చిదంబరం వివరించారు. అయితే దీనికి వ్యతి రేకంగా ఆటోమొబెైల్, హౌజింగ్ రంగాలు పుంజుకున్నాయని చెప్పారు. దీనికి కారణం ఈఎంఐల భారం తగ్గడమేనని ఆయన వివరంచారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలోనే రూ. 15,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు చిదంబరం వెల్లడించారు. ఈ ప్రణాళికను వచ్చే కొద్ది వారాల్లో ఖరారు చేయనున్నట్లు చెప్పారు. దీనివల్ల బ్యాంకులకు మరిన్ని మూలధన నిధులు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
63,200 మందికి ఉద్యోగాలు:
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 63,200 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఇందులో దాదాపు మూడో వంతు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లోనే లభించనున్నట్లు చెప్పారు. యువతీ యువకులు బ్యాంకుల్లో అపార ఉద్యోగవకాశాలున్నాయి. గత ఆర్దిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల్లో 84,489 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 63,200 ఉద్యోగాలను ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో భర్తీ చేయనున్నారు. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఒక్కటే 20 వేల క్లరికల్ సిబ్బందిని, 1200 మంది ఆఫీసర్ స్దాయి ఉద్యోగాలను నియమించుకోనుంది. ఇతర పీఎస్‌బీఐలు 22,000 మంది ఆఫీసర్లను, 20,000 మంది క్లరికల్ ఉద్యోగాలను చేర్చుకోనున్నాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications