
ఈ జాబితాలో మొదటి పది స్దానాల్లో నిలిచిన మిగతా ఏడుగురిలో శిఖా శర్మ (ఎండీ, సీఈవో యాక్సిస్ బ్యాంక్), వినీతా బాలి (ఎండీ, బ్రిటానియా ఇండస్ట్రీస్), శోభనా బర్తియ (ఛైర్ పర్సన్, హెచ్‌టి మీడియా), ప్రీతా రెడ్డి (ఎండీ, అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రెజెస్), జియా మోడి (కో ఫౌండర్, ఏజడ్‌బీ పార్టనర్స్), చిత్రా రామకృష్ణన్ (జాయింట్ ఎండీ, ఎన్ఎస్ఈ), రూపా కుద్వ (ఎండీ, సీఈవో క్రిసిల్) ఉన్నారు.
కొత్తగా స్థానం దక్కించుకున్న వారిలో ప్రభా పరమేశ్వరన్ ఎండీ కాల్గోట్ పాల్మోలివ్, ఆశియా డే సేక్యూరియా ఎండీ మోర్గాన్‌స్టాన్లీ, దేబ్‌జానీ ఘోష్, ఎండి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంటెల్ సౌత్‌ఏసియా, అబంతీ శంకరనారాయణ కంట్రీ హెడ్ డియాజీయో ఇండియా, అంజలీ బన్సాల్, మేనేజింగ్ పార్టనర్ స్పెన్సర్ స్టువార్ట్, ఆశాగుప్తా ఎండీ టప్పర్ వేర్ ఇండియా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న భారత మహిళా వ్యాపారవేత్తగా సన్ టీవీ నెట్ గ్రూప్ ఈడీ కావేరి కళానిధి (కళానిధి మారన్ భార్య) నిలిచారు. గత ఏడాది రూ. 72 కోట్లుగా ఉన్న అమె పే ప్యాకేజీ ఈ ఏడాది రూ. 57 కోట్లకు తగ్గినప్పటికీ.. అత్యధిక వేతనాలు పొందుతున్న అగ్రశ్రేణి పది మంది వ్యాపార మహిళల ఫార్చూన్ జాబితాలో మొదటి స్దానాన్ని కైవసం చేసుకున్నారు. పెనిన్సులా ల్యాండ్ ఛైర్ పర్సన్ ఉర్వి ఏ పిరమళ్ రూ. 7.3 కోట్లతో రెండో స్దానంలో నిలవగా, రూ. 6.9 కోట్ల ప్యాకేజీతో అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ ప్రీతా రెడ్డి మూడో స్దానంలో నిలిచారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications