ముంచుకురానున్న 'ఫిస్కల్ క్లిఫ్'.... భారతీయ ఐటీ స్టాక్స్ తగ్గుముఖం

'ఫిస్కల్ క్లిఫ్' అంటే ఏమిటీ..?
ప్రస్తుతం అమెరికా స్దూల దేశీయోత్పత్తి - రుణ భారం నిష్పత్తి 70 శాతం వరకూ ఉంది. ఇది గత 70 సంవత్సరాల కాలంలో అత్యధికం. మరో దశాబ్ద కాలంలో ఇది 90 శాతం వరకు పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా రుణభారం భారీగా పెరిగపోతే దేశం కుదేలయ్యే పరిస్దితి వస్తుంది. ఇలాంటి సందర్బంలో ద్రవ్యపరమైన సమస్యలను అదుపులోకి తెచ్చేందుకు తక్షణమే కఠిన చర్యలనే 'ఫిస్కల్ క్లిఫ్' గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే అమెరికా 2011 ఆగస్టులో బడ్జెట్ కంట్రోల్ చట్టాన్ని రూపొందించింది. దీని వల్ల సంక్షోభం నుండి ప్రభుత్వాన్ని రక్షించేందుకు గాను మరో 2.1 లక్షల కోట్ల డాలర్ల రుణాన్ని సమీకరించేందుకు అమెరికాకు వెసులుబాటు లభించింది.
ఈ నిధులు అయిపోయేలోగా ద్రవ్య లోటు సమస్యకు పరిష్కారం కనుగొనాలని, లేకపోతే గతంలో ఇచ్చిన పన్ను మినహాయింపు ఎత్తివేసి, పన్నులను పెంచాలని, సంక్షేమ పథకాల్లో భారీగా కోత కోయాలని సూచించారు. ఈ గడువు డిసెంబర్‌తో ముగుస్తుంది. ఈలోపు ద్రవ్యలోటు భర్తీ ప్రణాళికపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరని సమయంలో భారీగా పన్నులు, వ్యయాల కోత అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వానికి గణణీయంగా ఆదాయం వస్తుంది. జనవరి 1, 2013 నుండి కొత్త చట్టాలు అమల్లోకి వస్తే ప్రస్తుతం 15 శాతంగా ఉన్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 25 శాతానికి పెరుగుతుంది. డివిడెండ్లపై 15 శాతం నుండి 43 శాతానికి పెరుగుతాయి. ఎస్టేట్ ట్యాక్స్ 35 శాతం నుండి 55 శాతానికి పెరుగుతాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications