
ఆర్‌బీఐ అంచ నా ప్రకారం ద్రవ్యోల్బణం ఐదు నుంచి ఆరు శాతం మధ్యలో నమోదెైతేనే కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పలు సంద ర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి చూసుకుంటే ద్రవ్యోల్బణం కాస్తా తగ్గుముఖం పడుతుందని చెప్పవచ్చు. ఆగస్టు 2012లో ఎనిమిది శాతం ఉన్న ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి 7.81 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ నాటికి రూ.7.45 శాతానికి దిగి వచ్చింది. దీంతో ఆర్‌బీఐ జీడీపీ వృద్ధిరేటును దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లు తగ్గించాలని ఫిక్కీ అధ్యక్షుడు ఆర్ వి కనోరియా ఆర్‌బీఐను కోరారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త రూపా రేగి నిట్‌సూర్ మాట్లాడుతూ రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణం మరో 100 పాయింట్లు తగ్గితే వడ్డీరేట్లు తగ్గించే ఆలోచన చేయవచ్చునని చెప్పారు.
అక్టోబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 6.62 శాతానికి పరిమిత మైంది. ఆగస్టు నెలలో 7.86 శాతంగా నమోదెైంది. టోకు ధరల సూచిలో ఆహార పదార్థాల వాటా 14.3 శాతంగా ఉంటోంది. సంవత్సరం ప్రాతిపదికన చూస్తే బంగాళాదుంపలు 49.13 శాతం పెరిగాయి. ధాన్యాలు 20 శాతం, బియ్యం 11.40 శాతం పెరగగా.. కూరగాయల ధరలు 7.45 శాతం తగ్గాయి. ఉల్లిగడ్డలు 8.99 శాతం వరకూ తగ్గుముఖం పట్టాయి.
ఇక విద్యుత్ రంగ విషయానికి వస్తే 11.88 శాతం నుండి స్వల్పంగా తగ్గు ముఖం పట్టి 11.71 శాతానికి పరిమితమైంది. తయారీ రంగానికి వస్తే కాటన్ టెక్స్‌టైల్స్, ఇనుము, కాగితం, కాగితపు ఉత్పత్తులు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తులు అక్టోబర్ ముందు నెలతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. తయారీ రంగం ధరల విషయానికి వస్తే అక్టోబర్ నెలలో 5.95 శాతం కాగా అంతకు ముందు నెలలో 6.26 శాతంగా నమోదెైనాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications