ముంబై: దీపావళి సందర్బంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)లలో మధ్యాహ్నాం 3.45 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసిన ప్రత్యేక ట్రేడింగ్‌లో ప్రారంభంలో బీఎస్ఈ 60 పాయింట్లు, ఎన్ఎస్ఈ 14.55 పాయింట్లు లాభాన్ని నమోదు చేసినప్పటికీ.. ట్రేడింగ్ ముగిసే సమయానికి కల్లా నష్టాలను చవిచూసింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) సెన్సెక్స్ 52 పాయింట్లు కోల్పోయి 18,618.87 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 16.75 పాయింట్లు కోల్పోయి 5,666.95 వద్ద స్ధిరపడింది.
సెన్సెక్స్‌లో ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లి., ఓఎన్‌జీసీలకు చెందిన షేర్లు లాభపడగా.. టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్పోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర షేర్లు నష్టపోయాయి. కొత్త హిందూ సంవత్సరం (సంవత్ 2069) దీపావళి పర్వదినం రోజు నుండి ప్రారంభ కావడంతో ఈ ట్రేడింగ్ నిర్వహించారు. ఇది ఇలా ఉంటే బుధవారం (14న) బులియన్‌తో పాటు, స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో 14న ఫారెక్స్, మనీ మార్కెట్లు పని చేయవు.
ఈ ప్రక్క చిత్రంలో దీపావళి పర్వదినాన మూరత్ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్, సురేష్ ఒబెరాయ్ చూడొచ్చు.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
దీపావళి రోజున నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఈరోజు సెలవు | Deepawali trading: Strong stocks that can outperform in Samvat 2069 | దీపావళి రోజున నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
The Indian capital markets will hold special muhurat trading session today on the Diwali day on the NSE and the BSE.
Story first published: Wednesday, November 14, 2012, 12:18 [IST]
Other articles published on
Nov 14, 2012