
దీంతో మొండి బకాయిలు పేరుకపోవడంతో బ్యాంకు స్దూల నిరర్దక ఆస్తులు 5.15 శాతానికి ఎగిశాయి. సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకు స్దూల నిరర్దక ఆస్తులు రూ. 49,202.46 కోట్లకు చేరాయి. నికర ఎన్ పీఏలు రూ. 16,121 కోట్ల నుండి రూ. 22,615 కోట్లకు పెరిగాయి. Q1లో ఇవి మొత్తం రుణాల్లో 4.99 శాతం. నికర ఎన్ పీఏలు కూడా 2.22 శాతం నుండి 2.44 శాతానికి పెరిగి పోవడంతో శుక్రవారం ఎస్‌బీఐ షేర్లను ఇన్వెస్టర్లు భారీగా విక్రయించారు. బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 29,394 కోట్ల నుండి రూ. 32,953 కోట్లకు పెరిగింది.
బ్యాంకు వడ్డీ ఆదాయం కేవలం 5.3 శాతం పెరుగుదలతో రూ. 10,973 కోట్లకు చేరింది. బ్యాంకు పనితీరుకు ప్రమాణికంగా భావించే నికర వడ్డీ మార్జిన్ Q1తో పోలిస్తే Q2లో 20 బేసిస్ పాయంట్లు పెరిగి 3.77 శాతాన్ని అందుకుంది. బ్యాంకు మొత్తం రుణాలు మాత్రం ఆర్‌బీఐ అంచనాలకంటే ఎక్కువగా 17 శాతం వృద్ది చెంది రూ. 9.27 లక్షల కోట్లకు చేరింది. 2012 జులై - సెప్టెంబర్ క్వార్టర్లో అసోసియేట్ సంస్దలన్నింటితో కలిపి ఎస్‌బీఐ గ్రూప్ నికరలాభం రూ. 3,470.43 కోట్ల నుండి రూ. 4,575.31 కోట్లకు చేరుకుంది. మొత్తం గ్రూప్ ఆదాయం రూ. 41,244.65 కోట్ల నుండి రూ. 49,917.47 కోట్లకు పెరిగింది.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications