
ఈ క్వార్టర్‌లో సంస్ద ఆదాయం దారుణంగా రూ. 1553 కోట్ల నుండి రూ. 200 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మొత్తం మీద సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ మొత్తం నష్టాలు దాదాపు రూ. 9,000 కోట్లకు పేరుకుపోయాయి. వివిధ విభాగాల వ్యయం గణనీయంగా తగ్గడంతో కంపెనీ పునర్‌వ్యవస్దీకరణ ఖర్చు భారీగా పెరగాయన్నారు. వీటితో పాటు పన్నుల భారం సైతం పెరిగింది. 2006లో అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో ఒక్కసారి మాత్రమే కంపెనీ రూ. 9.6 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తిరిగి తమ సర్వీసులు ప్రారంభించేందుకు ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తున్నట్లు కంపెనీ తమ ప్రకటనలో తెలియజేసింది.
త్వరలో బ్యాంకర్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు తమ పునరుద్దరణ ప్రణాళికను సమర్పిస్తామని, త్వరలోనే కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని కంపెనీ పేర్కోంది. గురువారం హైదరాబాద్‌లో డీజీసీఏ ఛీఫ్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ సమగ్ర పునరుద్దరణ ప్రణాళికను సమర్పించడానికి కింగ్‌ఫిషర్‌కు నిర్దిష్ట గడువు అంటూ నిర్దేశించలేదని అన్నారు. త్వరలో ప్రణాళికను ఇస్తామని కంపెనీ చెప్పిందని, సంబంధిత ప్రతిపాదనల్లో అంశాలన్నీ పరిశీలించాకే లైసెన్స్ పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఇది ఇలా ఉంటే కింగ్ ఫిషర్‌కు రూ. 7,000 కోట్లకు పైగా రుణాలిచ్చిన బ్యాంకులు ప్రమోటర్లు మూలధనాన్ని సమరూకిస్తేనే విమానాలు నడిచే పరిస్దితి ఉందని, మరిన్ని రుణాలిచ్చే సమస్యేలేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications