గత ఏడాదితో పోలిస్తే క్షీణించిన ఎయిర్‌టెల్ నికర లాభం

Bharti Airtel
ముంబై: దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సెప్టెంబర్ Q2లో నిరాశా ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికరలాభం గత ఏడాది రెండో క్వార్టర్‌తో పోల్చుకుంటే 29.7 శాతం క్షీణించి రూ. 721.12 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది జులై- సెప్టెంబర్ కాలంలో సంస్ద నికరలాభం రూ.1027 కోట్లుగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్ 11వ క్వార్టర్‌లో లాభాలు తగ్గిపోయాయి. పోటీతో పాటు పెరిగిన వ్యయాలు కూడా లాభాలను దెబ్బతీశాయని తెలిపారు. దీంతో కంపెనీ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలను సిద్దం చేస్తుంది. ఈ ఆర్దిక సంవత్సరం (2012-2013) తొలి క్వార్టర్ (ఏప్రిల్ - జూన్)లో నమోదైన రూ. 762 కోట్లతో పోలిస్తే ప్రస్తుత లాభాలు 5 శాతం తక్కువ.

ఫలితాల అనంతరం కంపెనీ సీఈవో సంజయ్ కపూర్ మాట్లడుతూ గత 12 క్వార్టర్లలో తాము సుమారు 40 శాతం మేరకు ధరలను కోల్పోయామని అన్నారు. మార్కెట్లో పోటీ వాతావరణం నెలకొందని, అయినప్పటికీ ఏడాది మొత్తం మీద అత్యంత బలహీనమైన Q2లో మంచి ఫలితాలనే పొందామన్నారు. కంపెనీ రాబడి 17.14% వృద్ధితో రూ.17,276 కోట్ల నుంచి రూ.20,283 కోట్లకు చేరగా.. ఈఏడాది సెప్టెంబర్ చివరినాటికి ఎయిర్‌టెల్ అన్ని సర్వీసుల్లో కలుపుకొని ఖాతాదార్ల సంఖ్య 262.6 మిలియన్‌లకు చేరిందన్నారు.

Q2లో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం నెలకు రూ. 177కు చేరగా, గతయేడాది జులై - సెప్టెంబర్ కాలంలో రూ. 183గా నమోదైందని అన్నారు. సెప్టెంబర్ చివరికల్లా 20 దేశాల్లో విస్తరించిన మొత్తం కస్టమర్ల సంఖ్య 26.26 కోట్లకు చేరుకుంది. వీరిలో 25.18 కోట్ల మంది వైర్ లెస్ కస్టమర్స్. దీంతో భారతీ ఎయిర్‌టెల్ అంతర్జాతీయ స్దాయిలో నాల్గవ అతి పెద్ద కంపెనీగా అవతరించింది. ఇక ఇండియా విషయానికి వస్తే ఎయిర్‌టెల్‌కు 19.66 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. ఇందులో 54 లక్షల మంది 3జీ కస్టమర్లు. త్వరలో మహారాష్ట్ర, కోల్‌కత్తా, కర్ణాటక, పంజాబ్‌లలో 4జీ సర్వీసులను ప్రారంభించేందుకు లైసెన్స్‌ను తీసుకుంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+