
ఎస్‌బీఐ తన పబ్లిక్ నోటీసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ కొత్త ప్రమాణాల చెక్కులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తమ ఖాతాదారులంతా తమ తమ బ్యాంకు శాఖల్లో సీటీఎస్‌యేతర చెక్కులను తిరిగి ఇచ్చేసి సీటీసీ - 2010 స్టాండర్డ్ చెక్కులు తీసుకోవాలని సూచించింది. సీటీఎస్ చెక్కులను ఖాతాదారులకు అందించడం వల్ల మోసాలు తగ్గుతాయని, అలాగే క్లియరెన్సు కూడా వేగవంతం అవుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఇప్పటికే పలు బ్యాంకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. మరింత మంది కస్టమర్లను ఆకర్షించే భాగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మరో ముందడుగు వేసింది. సేవింగ్స్ ఖాతాలపై 'కనీస బ్యాలెన్స్' నిబంధనను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ఖాతాలో కనీసస్దాయిలో నగదు ఉంచకపోయినా ఎలాంటి పెనాల్టీలు విధించబోమని స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
ఒక విధంగా చెప్పాలంటే సేవింగ్స్ ఖాతాలను జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా చేసినట్లేనన్నమాట. ఇప్పటివరకూ బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తంగా 1000 రూపాయలు లేకుంటే రూ 100 వరకు పెనాల్టీ విధించే వారు. అలాగే ఎస్‌బిఐలో కొన్ని ఖాతాలకు కనీసం రూ 50 నగదు ఉంచాల్సి ఉంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications