
సెబీ నిబంధనల ప్రకారం షేర్ హోల్డర్స్ ప్యాట్రన్‌లో ఏవైనా మార్పులు(షేర్లు అమ్మడం, కొనడం) జరిగినట్లైతే ప్రమోటర్లు రెండు రోజుల్లో సెబీకి తెలియజేయాల్సి ఉంది. ఐతే బాంబే స్టాక్ ఎక్సేంజ్ కానీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కానీ దీనిపై ఎటువంటి సమాచారం అందలేని తెలిపింది. ఈ విషయంపై యూబీ గ్రూప్ అధికార ప్రతనిధి మాట్లాడేందుకు నిరాకరించారు. ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లెైన్స్ ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనం చెల్లించింది. మే నెల వేతనం దీపావళికి ముందే చెల్లిస్తుంది.
గత ఏడు నెలల నుంచి వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు సమ్మెకు దిగడం యాజమాన్యం లాకౌట్ ప్రకటించడం... డీజీ సీఏ కింగ్‌ఫిషర్ లెైసెన్సును రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో యాజమాన్యం జోక్యం చేసుకోని ఉద్యోగులతో చర్చలు జరిపి అక్టోబర్ 25వ తేదీన సమ్మె విరమించేలా చేసింది. ఉద్యోగుల బకాయిలు దీపావళిలోగా కొంత మొత్తం... మిగిలింది డిసెంబర్‌లోగా చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఉద్యో గులు సమ్మె విరమించిన వెంటనే తక్షణమే మార్చి నెల వేతనం చెల్లించింది.
ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పునరుద్దరణ ప్రణాళికను ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAకు సమర్పించే భాగంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పరిస్దితిని ఆయనకు వివరించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లాకౌట్ అయిన తర్వాత తొలిసారి యూబి గ్రూప్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవతో 30 నిమిషాల పాటు చర్చించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇంధనం ధరలు అధికంగా ఉండడం, అధిక పన్నులు, విదేశీ పెట్టుబడులకు అనుమతి లేకపోవడం ఇలా ఎన్నో విభిన్న కారణాల వల్ల భారత ఏవియేషన్ రంగం ఆకర్షణీయంగా లేదని అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు తగిన బాగస్వామి కోసం చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, ఆ కంపెనీ మరలా నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు నిధులందించే సత్తా తన యూబి గ్రూప్‌నకు ఉందని తెలిపారు.
ఇక కింగ్‌ఫిషర్ యాజమాన్యం డీజీసీఏను సంతప్తి పరిచి సస్పెన్షన్‌ను ఎత్తి వేయించుకోవాల్సి ఉంది. ఐతే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం ఎన్ని విమానా సర్వీసులు నిర్వహిస్తుంది. ఎప్పటి నుంచి సర్వీసులు ప్రారంభం అవుతా అనే విషయంపై స్ఫష్టత రాలేదు. పౌర విమానయానశాఖ డెైరెక్టర్ జనరల్ మాత్రం తమ ముందు ఖచ్చితమై ప్రణాళికతో ముందుకు వస్తేనే లెైసెన్సును పునరుద్దరిస్తామని చెబుతుంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications