
కంపెనీని రెండుగా విడదీయడం వల్ల లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని విప్రో సీఎఫ్‌వో సురేష్ సేనాపతి అన్నారు. మొత్తంగా విప్రో మార్జిన్లతో పోలిస్తే ఐటీ బిజినెస్ లాభం గరిష్ట స్థాయిలో ఉంటుందని తెలిపారు. విభజన నేపథ్యంలో యాజమాన్య నిర్వహణలో మార్పులు ఉండవని సేనాపతి చెప్పారు. విప్రో బోర్డు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అజీం ప్రేమ్‌జీ విప్రోకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గానే బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. అయితే విప్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. మొత్తం ఆదాయంలో 90% వాటాను ఆక్రమిస్తున్న ఐటీ సేవలపై మరింత దృష్టిపెట్టేందుకే వ్యాపార విభజనను చేపడుతున్నట్లు చెప్పారు.
100 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ పరిశ్రమలో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం, యాక్సెంచర్ వంటి దిగ్గజాలతో పోటీపడుతున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా భవిష్యత్‌లో ఐటీ సేవలపై మరింత దృష్టిని కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం 2013 మే నెల కల్లా లిస్టెడ్ కంపెనీలో ప్రమోటర్ల వాటా 75%కు మించరాదు. ప్రస్తుతం విప్రోలో ప్రమోటర్ల వాటా 78.3%గా ఉంది. విప్రో ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు తరువాత ఈ వాటా 75.7%కు దిగి వస్తుందని చెబుతున్నారు.
ఈ పునర్‌వ్యవస్దీకరణ పధకంలో భాగంగా దేశీయ వాటాదారులకు మూడు ఐచ్చికాలు ఉండోచ్చు. వాటాదారుల వద్ద ఉన్న రూ. 2 ముఖ విలువ కలిగిన ప్రతి ఐదు విప్రో షేర్లకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక విప్రో ఎంటర్‌ప్రైజెస్ షేరు లభిస్తుంది. రెండో ఐచ్చికంలో విప్రో వాటాదారులు వారి వద్ద ఉన్న ప్రతి 5 షేర్లకు రూ.50 ముఖ విలువ కలిగిన ఒక రిడీముబల్ ప్రిఫరెన్స్ షేరు పొందవచ్చు. మూడో ఆఫ్షన్లో విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో లభించే షేర్లకు బదులు ప్రమోటర్ల నుండి విప్రో షేర్లనే పొందవచ్చు. విప్రో లైటింగ్ ఉత్పత్తులతోపాటు సంతూర్, షికాకాయ్, చంద్రిక, బేబీ సాఫ్ట్, సన్‌ఫ్లవర్ వనస్పతి, గ్లూకోవిటా, యార్డ్‌లీ బ్రాండ్లు విప్రో ఎంటర్‌ప్రైజెస్లలో ఉన్నాయి.
ఐటీయేతర వ్యాపారాలను వేరు చేయడం వల్ల వాటాదారులకు లభించే విలువ పెరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. రెండు కంపెనీలపైనా ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఇకపై మరింత అభివృద్దిని అందుకుంటామని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అజీం ప్రేమ్‌జీ అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications