
ప్రపంచ ఎక్సేంజ్‌ల సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఈ) అందించిన సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) 20 రోజుల పాటు ట్రేడింగ్ జరగ్గా.. ఆగస్టు నెలతో పోలిస్తే 11 శాతం అధికంగా ట్రేడింగ్‌లు జరగడంతో ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సేంజ్‌గా అవతరించింది.
రెండవ స్దానంలో కొరియా ఎక్సేంజ్ 11.18 కోట్ల ట్రేడింగ్‌లు జరపగా... తర్వాత స్దానాల్లో న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్, యూరో స్టాక్ ఎక్సేంజ్‌లు 9.64 కోట్లతో ఉన్నాయి. ఆ తర్వాతి స్దానాల్లో నాస్డాక్ ఓఎమ్‌ఎక్స్, షెంజ్ హెన్ ఎస్‌ఈ, షాంఘై స్టాక్ ఎక్సేంజ్‌లు ఉన్నాయి. ఆసియా ఫసిఫిక్ రీజియన్లో వరుసగా తొమ్మిదో నెలలో కూడా ట్రేడింగ్‌ల పరంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిలిచింది. ఇక ఇండియాకు చెందిన బాంబే స్టాక్ ఎక్సేంజ్ 2.77 కోట్ల ట్రేడింగ్‌లతో ప్రపంచంలో ఏడవ స్దానాన్ని దక్కించుకుంది.
ఇది ఇలా ఉంటే ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ 204 పాయింట్ల వరకూ లాభపడుతూ 18,766కి సమీపంలో ట్రేడవుతోంది. అదే విధంగా నిప్టీ 59 పాయింట్లకు పైగా లాభపడుతూ 5,704 సమీపంలో ట్రేడవుతోంది. అన్ని సెక్టోరియల్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఆటో సూచీలు ఎక్కవగా లాభపడుతున్నాయి.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ గ్రూపు ఏలో అస్త్రజెనకా ఫార్మా, యూనియన్ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్మెంట్, సీఈఎస్‌సీ, హిందూస్దాన్ కాపర్ షేర్లు 3 నుండి 5 శాతం దాకా లాభపడుతూ టాగ్ గెయినర్స్‌గా ఉన్నాయి. నిప్టీలో బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, గెయిల్ షేర్లు 2 శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications