న్యూఢిల్లీ: ఆర్దిక వ్యవస్దలు, స్టాక్ మార్కెట్ల జాబితాలో ఇండియా నాలుగు స్దానాలు దిగజారి 40వ స్దానానికి పడిపోయింది. బుధవారం జరిగిన ప్రపంచ ఆర్దిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్దికాభివృద్ది సూచీ నివేదిక-2012లో ఈ విషయం వెల్లడైంది. గతయేడాది ఇండియా 36వ స్దానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీలు తాము ఒప్పుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోవడం, ఆర్దిక రంగ విధానాల సరళీకరణ విషయంలో వెనుకడుగు, ఐటీ కమ్యూనికేషన్‌లలో వసతుల కొరత లాంటి కారణాల వల్ల ఈ స్దానాన్ని కైవసం చేసుకుంది.
ప్రపంచ ఆర్దిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆర్దికాభివృద్ది సూచీ నివేదిక-2012 ముఖ్య విషయాలు:
* సూచీలో హాంకాంగ్ వరుసగా రెండో సంవత్సరం కూడా అగ్రస్దానంలో నిలిచింది. ఆ తర్వాత స్దానాల్లో అమెరికా, బ్రిటన్, సంగపూర్, ఆస్ట్రేలియా, కెనడాలున్నాయి. తొలి ఆరు దేశాల్లో గతయేడాదికీ, ఈ ఏడాదికీ మార్పు లేదు.
* మొత్తం 15 ఆసియా పసిఫిక్ దేశాల్లో ఇండియా 9వ స్దానంలో నిలిచింది.
* ఇండియా బ్యాంకింగేతర ఆర్దిక సేవల రంగంలో బలంగా ఉంది. ఇందులో 9వ స్దానాన్ని దక్కించుకుంది. బ్యాంకింగ్ రంగ సేవల విషయానికి వస్తే 45వ స్దానాన్ని సొంతం చేసుకుంది.
* ఈక్విటీ మార్కెట్లో పురోగమనం, బ్యాంకింగ్ వ్యవస్ద పనితీరులలో బలహీనతల కారణంగా నెదర్లాండ్స్ రెండు స్దానాలు దిగజారి 7 నుండి 9కి చేరింది. ఇక స్వీడన్ విషయానికి వస్తే 10వ స్దానానికి ఎగబాకింది.
తెలుగు వన్ఇండియా
Share This Article
English summary
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్: 40వ స్దానానికి దిగజారిన ఇండియా | India slips to 40th slot in World Economic Forum's financial development index | ప్రపంచ ఆర్దిక వేదిక ఆర్దికాభివృద్ది నివేదికలో వెల్లడైన నిజం
India has slipped four places in a raking of 62 leading financial systems and capital markets, because of weak institutional and business environment, the World Economic Forum said in a report released on Wednesday.
Story first published: Thursday, November 1, 2012, 15:16 [IST]
Other articles published on
Nov 1, 2012