23% పెరిగి రూ.1,938 కోట్లకు చేరిన ఆదాయం: ఛైర్మన్ వినీత్ నయ్యర్

2011-2012 Q2తో పోల్చితే 2012-2013 Q2లో కంపెనీ ఆదాయంలో 23 శాతం, నికర లాభంలో 16.80 శాతం వృద్ది చెందింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్దిక మందగమనం ఉన్నప్పటికీ మెరుగైన వృద్దిని సాధించగలిగామని మహీంద్రా సత్యం ఛైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు పెంచినప్పటికీ.. ఎబిటా మార్జిన్లు 21.5 శాతం ఉందన్నారు. త్వరలో టెక్ మహీంద్రాలో మహీంద్రా సత్యంను విలీనం చేయనున్నామని.. ఇందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి రావాల్సి ఉందని తెలిపారు. ఇటీవల సత్యం కంప్యూటర్స్ వ్యవస్దాపక ఛైర్మన్ రామలింగ రాజుకు చెందినవిగా పేర్కోంటూ ఈడీ అటాచ్ చేసిన రూ. 822 కోట్ల నిధులకు సంబంధించి కోర్టులో అప్పీలు చేస్తామని నయ్యర్ చెప్పారు.
నాగ్‌పూర్, విశాఖపట్టణం, చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్ ఎస్‌ఈజెడ్ క్యాంపస్‌లలో వసతుల అభివృద్ది కోసం రాబోయే 18 నెలల్లో రూ. 500 కోట్లు వెచ్చిస్తామని గుర్నానీ చెప్పారు. సెప్టెంబర్ 30వ తారీఖు నాటికి కంపెనీ వద్ద రూ. 3,062 కోట్ల నగదు, నగదు సమాన నిల్వలున్నాయని చెప్పారు. ఇక మహీంద్రా సత్యం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 36,787. 6 కొత్త క్లయింట్ల రాకతో క్లయింట్ల సంఖ్య 363కు చేరుకుంది. పాత ప్రమోటర్లు, సంస్దలు ఇచ్చినట్లు పేర్కోంటున్న రూ. 1,230 కోట్లతో తమకు సంబంధం లేదని చెప్పారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications