కీలక వడ్డీరేట్లను మార్పు చేయకపోవడంతో ఆర్థికమంత్రిగా చిదంబరం అసంతృప్తి
News
oi-Nageshwara
By Nageswara Rao
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ పరపతి విధాన సమీక్ష విధానంలో కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం పట్ల ఆర్థికశాఖ మంత్రి పి చిదంబరం అసంతప్తి వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణంతో పాటు వద్ధిరేటు కూడా సవాలుతో కూడుకుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఒక్కటే ఈ సవాలును అధిగమిస్తుందని తన అసంతప్తిని వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రిగా చిదంబరం బాధ్యతలు చేపట్టాక సంస్కరణలు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందని ఇటీవల ఆయన పాల్గోన్న సమావేశంలో చెప్పకనే చెబుతున్నారు. ఐతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాత్రం ఆర్‌బీఐ రేపోరేటును ఎనిమిది శాతానికి సీఆర్‌ఆర్ నగదు నిల్వల నిష్పత్తిని 0.25 శాతం తగ్గించి 4.25 శాతానికి కుదించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తేనే కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ డి సుబ్బారావు అన్నారు.
సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 7.81 శాతానికి ఎగబాకింది(ఆగస్టులో 7.55శాతం). ద్రవ్యోల్బణం త్వరగా దిగొచ్చే సూచనలు లేనందువల్ల జనవరిలోనే ఆర్‌బీఐ రేట్ల కోత ఉంటుందని ప్రధాని ఆర్దిక సలహా మండలి ఛైర్మన్ సి. రంగరజాన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. వడ్డీరేట్లు తగ్గించేందుకు ఇది సరెైన సమయం కాదని అన్నారు. నగదు నిల్వల నిష్పత్తిని కాస్తంత సడలించి వ్యవస్థలో కొంత నగదు చలామణి చేస్తామని... దీని ద్వారా వృద్ధికి కావాల్సిన ద్రవ్యం అందుబాటులో ఉంటుందని సుబ్చారావు పరపతి విధాన నిర్ణయాలు ప్రకటిస్తూ స్పష్టం చేశారు.
సీఆర్‌ఆర్‌ను ఎత్తివేయాలంటూ ఆర్‌బీఐతో ఎదురుగా తలపడ్డ ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి మరోసారి తన నోటికి పదును పెట్టారు. మన ఆర్థిక వ్యవస్థకు సీఆర్‌ఆర్ వేస్టు అంటూ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తాను ఆశావాదినని, సీఆర్‌ఆర్‌ను ఆర్‌బీఐ కనీసం అర శాతమైనా తగ్గిస్తుందని ఆశిస్తే పావు శాతమే తగ్గించిందని చౌదరి చెప్పారు. అయినా కూడా ఇప్పటికీ ఆర్‌బీఐ ఎన్నిసార్లు పాలసీ రేట్లను పెంచినా, ద్రవ్యోల్బణాన్ని మాత్రం అదుపు చేయలేకపోయిందని అన్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి కారణం డిమాండు కాదని, ధరల పెరుగుదలేనని పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారావమ్ మాట్లాడుతూ... వడ్డీరేట్లు తగ్గిస్తే బాగుండదని అన్నారు. ఆర్‌బీఐ కేంద్రప్రభుత్వం కలిసిపనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను ద్రవ్యలోటును అదుపులోకి తేవాలనే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి చిదంబరం 5 సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి రోడ్గ మ్యాప్ (ప్రణాళిక)ను విడుదల చేశారు. గతంలో సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన ద్య్రవపరపతి సమీక్షా సమావేశానికి ముందే కేంద్రప్రభుత్వం పలు కీలక సంస్కరణలు ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.