
ఆగస్టు 31వ తారీఖున సుప్రీం కోర్టు సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌ల మదుపర్ల నుంచి వసూలు చేసిన రూ.24 వేల కోట్ల సొమ్ముపై ఏటా 15 శాతం వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేయాలని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. వచ్చే మూడు నెలల్లో సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ కే ఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ ఖెహర్ న్యాయమూర్తుల ధర్మాసనం సహారా గ్రూపును ఆదేశించింది. పూర్తిగా మార్చుకునేందుకు వీలుండే డిబెంచర్ల జారీ ద్వారా సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలు దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి రూ. 25,781 కోట నిధులు సేకరించాయి. ఆగస్టు 31, 2012 నాటికి నిధుల రూ.24,029 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తంపై 15 శాతం వడ్డీరేటుతో చెల్లించాల్సిన మొత్తం రూ.38 వేల కోట్లకు చేరుకోనుంది.
ఈ నిధులను నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించని పక్షంలో చర్యలు తీసుకోవాల్సిందిగా క్యాపిటల్ మార్కెట్ నియంవూతణ మండలి సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డు(సెబీ)ను కోర్టు బెంచ్ ఆదేశించింది. సంస్థలకు చెందిన ఆస్తుల జప్తుతో పాటు బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసేందుకు నియంవూతణ మండలికి అనుమతిచ్చింది. అంతేగాక ఈ రెండు సంస్థలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సెబీని నిర్దేశించింది. ఇందుకోసం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను సెబీకి సమర్పించాల్సిందిగా సంస్థలను ధర్మాసనం ఆదేశించింది. సెబీ జరపబోయే దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్ అగర్వాల్‌ను నియమించింది.
దీంతో చాలా మంది డిపాజిటర్లకు సంబంధించిన సమాచారం సరిగా లేదని భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఇవ్వాల్సిన సహారా సెబీకి సరిగా సహాకరించడం లేదని వార్తలు వస్తున్న నేపధ్యంలో సెబీ ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని భావించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications