దీపావళి లోపు 3 నెలలు జీతాన్ని చెల్లించడానికి సిద్దమైన కింగ్‌ఫిషర్ యాజమాన్యం
ముంబై: 23 రోజులుగా సమ్మె చేస్తున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు దీపావళి నాటికి మూడు నెలల జీతాన్ని చెల్లించడానికి కింగ్‌ఫిషర్ యాజమాన్యం ముందుకు వచ్చింది. ఉద్యోగులు, యాజమాన్యం మధ్య నిన్న (సోమవారం) నాలుగు గంటల పాటు జరిగిన చర్చలు ఫలించాయి. చర్చల అనంతరం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సీఈఓ సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హితేశ్ పటేల్ మాట్లాడుతూ చర్చలు ఫలించాయని, దీపవాళి నాటికి మూడు నెలల జీతాలు చెల్లించడానికి ముందుకు వచ్చామని ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ఉద్యోగులకు సమయం ఇచ్చామని అన్నారు. ఈ ప్రతిపాదనను ఉద్యోగుల్లో ఒక వర్గం తిరస్కరించగా మరో వర్గం గురువారం నాడు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది.

ఏడు నెలలు వేతన బకాయిలను తక్షణం చెల్లించాలని గత 23 రోజులుగా కంపెనీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. కంపెనీ లాకౌట్ ప్రకటిచండం, విమానయాన సంస్ద డీజీసీఏ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లైసెన్స్‌ను రద్దు చేయడం వంటి తదితర పరిణామాలతో కంపెనీ సీఈఓ సంజయ్ అగర్వాల్ నిన్న చర్చలు జరిపారు. లాకౌట్‌ను కూడా పొడిగిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు సమగ్రమైన పునరుద్దణ ప్రణాళికను సమర్పించనున్నట్లు తెలిపారు. 24 గంటల్లో నెల రోజుల వేతనాన్ని, వారం రోజుల్లో రెండో నెల వేతనాన్ని, నవంబర్ 13 లోపు మూడో నెల జీతాన్ని చెల్లించడానికి యాజమాన్యం ప్రతిపాదన చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సుభాష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ కంపెనీ సీఈఓ సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హితేశ్ పటేల్ మీద మాకు నమ్మకం లేదు. వారి ప్రతిపాదనను మేం తిరస్కరించాం. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాతో మేము సమావేశం అవుతామని అన్నాడు. ఇది ఇలా ఉంటే సమ్మె విరమించి ఉద్యోగులంతా విధులకు హాజరైనా డీజీసీఏ నుండి అన్ని అనుమతులు పొంది కార్యకలాపాలు ప్రారంభించడానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దాదాపు నెల రోజుల సమయం పడుతుందని సమాచారం.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications