
తమకు హామీగా వుంచిన ఆస్తుల ద్వారా రుణ బకాయిల్లో గరిష్ఠంగా 10-15% మాత్రమే రాబట్టుకోగలమని, అందువల్ల రికవరీ చర్యలే ఇక చివరి మార్గమని భావిస్తున్నామని ముంబయికి చెందిన ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ సీనియర్ అధికారి చెప్పారు. ఈ బ్యాంక్ కింగ్‌ఫిషర్‌కు రూ.500 కోట్ల దాకా రుణాలు ఇచ్చింది. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మళ్లీ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించి, మా రుణాలను చెల్లించాలని మేం కోరుకుంటున్నాం అన్నారు. పూర్తిగా కంపెనీ మూతబడనంత వరకూ పరిస్దితుల్లో పెద్దగా మార్పులేవీ ఉండవు. కంపెనీ పూర్తిగా మూతబడితే రికవరీ చర్యలపై దృష్టిపెడతామని ఎస్‌బీఐ ఎండీ(మిడ్-కార్పోరేట్స్) ఎస్. విశ్వనాథన్ పేర్కోన్నారు. బ్యాంకుల కన్సార్టియానికి నేతృత్వం వహిస్తున్న ఎస్‌బీఐ కింగ్‌ఫిషర్‌కు రూ. 1,500 కోట్ల వరకు రుణ సహాయం చేసింది.
కింగ్‌ఫిషర్ బ్యాంకర్ల నుండి డబ్బు పొందేందుకు గాను గోవాలో కింగ్‌ఫిషర్ విల్లా, ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌లను కొలేటరల్‌గా తనఖా పెట్టింది. వీటిని విక్రయించేందుకు వీలుగా మదింపు చేపట్టడం కోసం బ్యాంకర్లు జులైలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే. మార్గెట్ వర్గాల ప్రకారం ఈ రెండు ఆస్తులను అమ్మితే గరిష్టంగా రూ. 180 కోట్లు మాత్రమే వస్తుందని అంచనా.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications