
గతయేడాది Q2లో ఆదాయం రూ. 11,633 కోట్లు. టీసీఎస్ ఫలితాలను ప్రకటించక ముందు పలు బ్రోకరేజి కంపెనీలకు చెందిన విశ్లేషకులు సగటున రూ. 3,383 కోట్ల నికర లాభంతో పాటు కంపెనీ మొత్తం ఆదాయం రూ. 15,555 కోట్ల ఆదాయం వరకు ఉండోచ్చునని అంచనా వేశారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)తో పోల్చినా మెరుగైన పనితీరునే ప్రదర్శించింది. Q1లో నికర లాభం రూ. 3,318 కోట్లతో పోలిస్తే Q2లో 3.5 శాతం వృద్ది చెందింది. అదే విధంగా Q1 ఆదాయం రూ. 14,869తో పోల్చిచూస్తే Q2 ఆదాయం 5.1 శాతం ఎగబాకింది.
క్యూ1లో నికర లాభం రూ. 3,318 కోట్లతో పోలిస్తే క్యూ2లో 3.5 శాతం వృద్ధి చెందింది. అదేవిధంగా క్యూ1 ఆదాయం రూ.14,869తో పోల్చిచూస్తే... క్యూ2 ఆదాయం 5.1 శాతం ఎగబాకింది.
Q2 ఫలితాల్లో ముఖ్యాంశాలు:
* Q2లో షేరు వారీ ఆదాయం(ఈపీఎస్) రూ. 17.51గా నిలిచింది.
* 41 మంది కొత్త క్లయింట్లను కంపెనీ జత చేసుకుంది.
* టీసీఎస్ కొత్త ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా రాజేష్ గోపినాథన్‌ను నియమించినట్లు ప్రకటించింది.
* ప్రస్తుతం ఆయన కంపెనీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్) వ్యవహారాలు చూసుకుంటున్నారు.
* ప్రస్తుతం (సీఎఫ్ఓ)గా ఉన్న ఎస్ మహాలింగం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేయనున్నందన కంపెనీ ఈ మార్పు చేసిందని తెలిపారు.
* శుక్రవారం నుండి ఫిబ్రవరి 9 వరకూ గోపినాథన్ డిప్యూటీ సీఎఫ్ఓగా వ్యవహరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Q2లో టీసీఎస్‌లో 18,654 మంది ఉద్యోగులు చేరారు. ఐతే ఇతర కంపెనీలకు వలసపోయిన వారిని తీసేస్తే నికరంగా 10,531 మంది కొత్త సిబ్బంది చేరారు. దీంతో సెప్టెంబర్ చివరకి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,54,076. వచ్చే ఏడాది (2013-2014)లో క్యాంపస్ నియామకాల ద్వారా 25వేల మందిని కొత్తగా చేర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెచ్‌ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ పేర్కోన్నారు.
కంపెనీ ఫలితాలు విడుదల చేసిన తర్వాత కంపెనీ సీఈఓ ఎండీ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ పస్తుత మార్జిన్ల స్థాయిని నిలబెట్టుకునేలా... లాభదాయక వృద్ధి వ్యూహాన్ని ఇక ముందూ కొనసాగించడంపై దృష్టిసారిస్తున్నాం. నాస్కామ్ అంచనాల కంటే మెరుగైన వృద్ధి దిశగా మేం పయనిస్తున్నాం. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, కస్లమర్లు తమ అవుట్‌సోర్సింగ్ వ్యయాలపై నిర్ణయాల్లో జాప్యాలు చేయడం, ప్రైసింగ్ విషయంలో ఒత్తిడి వంటిదేమీ మాకు ఎదురవడం లేదని అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications