విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లైసెన్స్‌ను రద్దు చేసిన డీసీజీఏ

Vijay Mallya-Kingfisher Airlines
న్యూఢిల్లీ: భారతదేశపు ప్రైవేటు రంగ విమానయాన సంస్ద కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు తదుపరి ఉత్తర్వుల కోసం కింగ్‌ఫిషర్ విమాన సంస్ద వేచిచూడాలని డీజీసీఏ ప్రకటించింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లాకౌట్‌ను ఈ నెల 23 వరకూ పొడిగించడంతో విమానయాన సంస్ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ (డీసీజీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు మాటమాటికీ సర్వీసులను రద్దు చేయడం, ఏడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోడవంతో మీ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ డీసీజీఏ అక్టోబర్ 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ శుక్రవారం సమాధానం అందజేసిన విషయం తెలిసిందే.

విమానయాన సంస్ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ (డీసీజీఏ)కు చెందిన ఉన్నతాధికొకరు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు అధికారకంగా తెలిపారు. సమస్యల పరిష్కారానికి 21 రోజుల సమయాన్ని ఇచ్చామని, ఈ సమయంలో కింగ్ ఫిషర్ తన సమస్యల్ని పరిష్కారం కనుగొనలేకపోయిందని అందుకే లైసెన్స్‌ను రద్దు చేశామన్నారు. డీజీసీఏ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇస్తూ నిన్న కంపెనీ ప్రతినిధి లాకౌట్‌ను అక్టోబర్ 20 నుండి 23 వరకూ పొడిగిస్తున్నట్లు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తెలిపింది.

మా పునరుద్దరణ ప్యాకేజీకి డీజీసీఏ నుండి ఆమోదం లభిస్తే తిరిగి సేవలను ప్రారంభించగలమన్న ధీమాను కింగ్ ఫిషర్ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ (డీసీజీఏ) షోకాజ్ నోటీసులో లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చామని తెలిపారు. గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని సెప్టెంబర్ 30న పైలెట్లు సమ్మెకు దిగడంతో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సేవలకు విఘాతం ఏర్పడింది. అంతక ముందు అక్టోబర్ 13 నుండి కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తుందని వార్తలు వచ్చిన నేపధ్యంలో విమానయాన నియంత్రణ సంస్ద డీజీసీఏ టిక్కెట్ల విక్రయాలను ఆపివేయాలని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ చెల్లించాల్సిన రూ. 1,580 కోట్ల రుణాలను ఎస్‌బీఐ ఇప్పటికే నిరర్థక ఆస్తిగా వర్గీకరించింది. బ్యాంకులకు కింగ్‌ఫిషర్ దాదాపు రూ. 7,000 కోట్ల మేర రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+